మరో సంచలన నిర్ణయం దిశగా కేంద్రం

Ravi Shankar Prasad
x
Ravi Shankar Prasad
Highlights

కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. డ్రైవింగ్‌ లైసెన్సుకు ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉందని త్వరలో దాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తామని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.

కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. డ్రైవింగ్‌ లైసెన్సుకు ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉందని త్వరలో దాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తామని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఆధార్‌ దేశ ప్రజల జీవితాల్లో పెను మార్పు తీసుకొచ్చిందన్న మంత్రి ప్రతి ఒక్కరి గుర్తింపుకూ అదే ప్రధానమని స్పష్టం చేశారు.

కేంద్రం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. అతి త్వరలో డ్రైవింగ్ లైసెన్స్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు సిద్ధమవుతోంది. నకిలీ డ్రైవింగ్‌ లైసెన్సుతో పాటు ప్రమాదాలు జరిగినప్పుడు నిందితులు తప్పించుకోడానికి వీళ్లేకుండా డ్రైవింగ్‌ లైసెన్సుకు ఆధార్‌ను అనుసంధానం చేయబోతోంది. దీనికి సంబంధించిన బిల్లు ప్రస్తుతం పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉందన్నారు.

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు చాలావరకు నిందితులు తప్పించుకుంటున్నారని మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ప్రమాదాలు జరిగాక నిందితుడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేసినా అతడు పక్క రాష్ట్రాలకు వెళ్లి ఇతర గుర్తింపు కార్డులతో లైసెన్స్‌ తెచ్చుకునే అవకాశం ఉందన్నారు. కానీ ఆధార్ అనుసంధానంతో నిందితుడు తప్పించుకునే వీలుండదన్నారు. ఒకవేళ పేరు మార్చుకున్నా బయోమెట్రిక్స్‌ను మాత్రం మార్చలేరన్నారు. అలాగే, ట్రాఫిక్ ఉల్లంఘనులు కూడా తప్పించుకోలేరన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వమే డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, లైసెన్స్‌లు జారీ చేస్తుందని కూడా తెలిపారు.

డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియ ఏళ్ల తరబడి అసంఘటిత ప్రక్రియగానే ఉండిపోయిందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ అంతా డిజిటల్ వైపుగా మళ్లినా పరిస్థితుల్లో మాత్రం పూర్తిగా మార్పు రాలేదన్నారు. ఆధార్ అనుసంధానం వల్ల నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు అవుతాయని మంత్రి వివరించారు. ఇది దేశంలో నాణ‌్యమైన ప్రమాణాలు నెలకొల్పేందుకు తోడ్పడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories