చక్కని కాపురంలో చిచ్చు పెట్టిన మటన్ ముక్క ..

చక్కని కాపురంలో చిచ్చు పెట్టిన మటన్ ముక్క ..
x
Highlights

ఇద్దరు ఒకే మతస్థులు.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ..కాపురం ఓ ఆరు నెలలు చాలా చక్కగా సాగింది.. కానీ వీళ్ళ కాపురంలో ఓ మటన్ ముక్కొచ్చి చిచ్చు పెట్టింది...

ఇద్దరు ఒకే మతస్థులు.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ..కాపురం ఓ ఆరు నెలలు చాలా చక్కగా సాగింది.. కానీ వీళ్ళ కాపురంలో ఓ మటన్ ముక్కొచ్చి చిచ్చు పెట్టింది .. వినడానికి విచిత్రంగా ఉన్నా నిజమే మరి .. ఈ సంఘటన హైదరాబాద్ లోనే చోటు చేసుకుంది .. ఇక వివరాల్లోకి వెళ్తే .. అ అబ్బాయి కుటుంబీకులు పూర్తి శాఖాహారులు. తమకు ముక్కవాసన పడదని అ యువకుడు ముందే చెప్పాడు. ఒకవేళ నాన్ వెజ్ తినాలనిపిస్తే బయట తినాలని పెళ్లికి ముందే షరతు విధించాడు. అందుకు అమ్మాయి కూడా అంగీకరించడంతో ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు.

భర్త షరతును ముందుగా అంగీకరించిన అ భార్య తర్వాత మాట తప్పింది .. ఇంట్లోనే ముక్కకూర వండడం మొదలు పెట్టింది . పోనీ ఇక్కడితే ఆగిందా అంటే అది లేదు . భర్తతో కూడా తినిపించాలని అనుకుంది . దీనికి భర్త అంగీకరించకపోవడంతో అలిగి పుట్టింటికి వెళ్ళింది. భర్తకి ఎలా అయిన బుద్ది చెప్పాలి అనుకున్నా ఆమె జూబ్లిహిల్స్ పోలిసులుకు తనని తన భర్త వేదిస్తున్నడంటూ కేసు పెట్టింది . తీరా విచారణలో అసలు నిజం తెలుసుకున్నా పోలీసులు అవాక్కయ్యారు .. ఇరు కుటుంబ సభ్యులకి సంబంధించిన పెద్ద మనుషులను నచ్చజెప్పే ప్రయత్నం చేసారు .. కానీ ఇంకా పంచాయితీ తేలలేదు ..

Show Full Article
Print Article
Next Story
More Stories