logo

కుక్కును కాల్చబోయి.. మహిళను కాల్చిన పోలీసు!

కుక్కును కాల్చబోయి.. మహిళను కాల్చిన పోలీసు!
Highlights

కుక్కును కాల్చబోయి..పొరపాటున ఓ మహిళనే కాల్చాడు ఓ పోలీసు అధికారి. ఈ ఘటన అమెరికా.. టెక్సాస్‌లోని అర్లింగ్‌టన్...

కుక్కును కాల్చబోయి..పొరపాటున ఓ మహిళనే కాల్చాడు ఓ పోలీసు అధికారి. ఈ ఘటన అమెరికా.. టెక్సాస్‌లోని అర్లింగ్‌టన్ షాపింగ్ మాల్ సమీపంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే షాపింగ్ మాల్ వద్ద వేగంగా పరుగెత్తుకుంటూ ఓ కుక్కు పోలీసు అధికారి వైపునైకు వస్తోంది. దీంతో ఆ పోలీసు అధికారికి ఏం చేయాలో అర్ధంకాక భయంతో వణికిపోతున్నాడు. క్రిమినల్స్‌ని అయితే ఎలాగోలా మ్యానెజ్ చేయ్యాలో తెలుసుకాని.. కుక్కులను ఎలా డీల్ చేయాలో ఈ పోలీసు అధికారికి తెలియలేదు. దీంతో తన వద్ద ఉన్న గన్ తీసి కుక్కపైకి గురిపెట్టాడు. భయంతో టీపీ టీపీ మని రెండు మూడుసార్లు కాల్పులు జరిపాడు.

అయితే ఇక్కడే ఆ అధికారి పప్పులో కాలేసాడు. భయంతో కుక్కపై కాల్పులు అయితే జరిపాడు కానీ.. ఆ బుల్లెట్ సరాసరి కుక్కకి తాకయో లేదో అనేది మాత్రం చూసుకోలేదు. ఈ క్రమంలోనే ఎవరో గట్టిగా అరిచిన శబ్ధం వినిపించింది ఆ పోలీసు అధికారికి. దీంతో హుటాహుటినా అక్కడి వెళ్లి చేసేసరికి అసలు విషయం పోలీసు అధికారికి అర్దంమైంది. తాను కాల్పులు అయితే జరిపాడు కానీ.. కుక్కకు బదులుగా ఓ మహిళ తీవ్రంగా గాయలపాలైనట్లు గుర్తించాడు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు పోలీసు అధికారి. దీంతో తీవ్రగాయాలపాలైన మహిళను హుటాహుటిన దగ్గర్లో దవాఖానకు తరలించాడు. అయితే అప్పటికే ఆ మహిళ చిక్సిత పొందుతూ మృతి చెందింది. చనిపోయిన మహిళను 30ఏళ్ల మార్గరీటాగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటనకు కారణమైన అధికారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.


లైవ్ టీవి


Share it
Top