ఒక సెల్ఫీ అతని ప్రాణాలను కాపాడింది .. అది ఎలా అంటే ..?

ఒక సెల్ఫీ అతని ప్రాణాలను కాపాడింది .. అది ఎలా అంటే ..?
x
Highlights

ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో సెల్ఫీల మోజు ఎక్కువ .. ఎక్కడ బడితే అక్కడే సెల్ఫీలు దిగుతూ తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు .. కానీ ఓ వ్యక్తిని మాత్రం అదే...

ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో సెల్ఫీల మోజు ఎక్కువ .. ఎక్కడ బడితే అక్కడే సెల్ఫీలు దిగుతూ తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు .. కానీ ఓ వ్యక్తిని మాత్రం అదే సెల్ఫీ కాపాడింది.. అది ఎలాగో తెలియాలంటే ఇది చదవాల్సిందే .. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది .. ఓ వ్యక్తి తన భార్యతో వచ్చిన గొడవ కారణంగా ఇంటి నుండి బయటకు వెళ్లి చనిపోవాలని అనుకున్నాడు .. అందులో భాగంగానే ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళాడు ..

అయితే చనిపోయే ముందు ఓ సెల్ఫీ దిగి తన స్నేహితులకు తెలియజేసాడు .. విషయాన్ని అందుకున్న అతని స్నేహితులు ఆటను ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేసారు .. అయితే అతడు పంపిన సెల్ఫీలో రైల్వేకు చెందిన పసుపు రంగులోని మైలు రాయి ఒకటి వారికి కనిపించింది . ఇదే విషయాన్ని వారు రైల్వే అధికారులకు మరియు పోలీసులకు చెప్పగా వెంటనే సమాచారం అందుకొని అ మార్గంలో వచ్చే రైలును నెమ్మదిగా రావాలని సూచించారు ..

అతడు ఉన్న ప్రదేశానికి చేరుకొని అతని ప్రాణాలను కాపాడారు .. భార్యాభర్తలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు .. అంతే కాకుండా సమయానికి సరైనా సమాచారం అందించిన అతని స్నేహితులకు మరియు సహాయ పడ్డ రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలిపారు పోలీసులు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories