నిలోఫర్ లో పాపం పసిప్రాణాలు..

నిలోఫర్ లో పాపం పసిప్రాణాలు..
x
Highlights

చిన్నారులకు ప్రాణం పోయాల్సిన హెల్త్‌‌కేర్‌ సెంటర్‌లో నిలువెత్తం నిర్లక్ష్యం ప్రభలించింది. దీంతో ముద్దులొలికే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు....

చిన్నారులకు ప్రాణం పోయాల్సిన హెల్త్‌‌కేర్‌ సెంటర్‌లో నిలువెత్తం నిర్లక్ష్యం ప్రభలించింది. దీంతో ముద్దులొలికే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని పసి హృదయాలు విలవిల్లాడుతూ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. వ్యాక్సిన్‌ వికటించడంతో ఈ ప్రమాదం జరగిందని, ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌ నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో శిశువులకు వాక్సినేషన్‌ వేశారు. ఒకటిన్నర నెలల నుంచి మూడున్నర నెలలలోపు ఉన్న మొత్తం 92 మంది శిశువులకు పెంటావాలంట్‌ వాక్సిన్‌ ఇచ్చారు. సాధారణంగా టీకాలు వేశాక శిశువులకు జ్వరం వచ్చే అవకాశం ఉండటంతో దాన్ని తగ్గించేందుకు పారాసిటమాల్‌ టాబ్లెట్‌ ఇవ్వాల్సి ఉండగా నొప్పుల నివారణకు వాడే ట్రెమడాల్ - 300 ఎంజీ పెయిన్‌కిల్లర్‌ టాబ్లెట్లను ఇచ్చారు. వైద్య సిబ్బంది పరిశీలించకుండానే మాత్రలను పంపిణీ చేయడంతో విషయం తెలియని తల్లిదండ్రులు వాటిని పిల్లలకు వేశారు. దీంతో టాబ్లెట్‌ వేసిన కొద్దిసేపటికే అవి వికటించి పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

డోస్‌ ఎక్కువై ఊపిరాడక, అపస్మారక స్థితిలోకి చేరుకున్న పిల్లలను నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే కిషన్‌బాగ్‌కు చెందిన రెండున్నర నెలల ఫైజాన్‌ అనే బాలుడు మృతిచెందగా ఇటు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ అపస్మారక స్థితిలో ఆస్పత్రికి చేరుకున్న మరో ఇద్దరు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో 21 మంది చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తక్షణమే నివేదిక ఇవ్వాలంటూ ఆరోగ్య శాఖను ఆదేశించింది. విషయం తెలిసిన వెంటనే ఘటన వివరాలు తెలుసుకున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ నుంచి హుటాహుటిన హాస్పిటల్‌కు చేరుకని పరిస్థితిని పరిశీలించారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై చిన్నారుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. బాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories