స్నేహితురాలి కోసం.. మొసలితో పోరాడి కళ్లు పీకేసిన చిన్నారి

స్నేహితురాలి కోసం.. మొసలితో పోరాడి కళ్లు పీకేసిన చిన్నారి
x
Highlights

ఓ చిన్నారి తన స్నేహితురాలిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి మొసలితో పోరాడింది. ఈ ఘటన జింబాబ్వేలో జరిగింది.

ఓ చిన్నారి తన స్నేహితురాలిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి మొసలితో పోరాడింది. ఈ ఘటన జింబాబ్వేలో జరిగింది. సిందెరేలా అనే గ్రామంలో రెబెకా ముంకోబ్వే అనే బాలిక తన స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెల్లింది. ఈ క్రమంలో తన స్నేహితురాలు మౌవానీని ఓ మొసలి నోటితో కరుచుకుని నీటిలోపలికి తీసుకెళ్లింది.దీంతో మౌవానీ భయంతో బిగ్గరగా కేకలు వేసింది.

రెబెకా పరుగున వచ్చి లయోటాను లాక్కెళ్తున్న మొసలిని వెంబడించింది. వెంటనే ముసలిపైకి ఎక్కి పిడికితో దాని తలపై బాదుతూ.. వెంటనే మొసలి కళ్లు పీకేసింది. రెబెకా మొసలి కళ్లు పీకడంతో ‎నొప్పితో విలవిల్లాడిన మొసలి లయోటాను విడిచిపెట్టింది. లయోటాను వీపునకు కట్టుకుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. మొసలితో జరిగిన యుద్ధంలో లయోటాకు స్వల్ప గాయాలు అయ్యాయని ఆస్పత్రి వైద్యులు తెలిపారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories