ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. అమెరికాలో మరీ ఘోరం..

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. అమెరికాలో మరీ ఘోరం..
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల 83 వేల 33 మందికి కరోనావైరస్ సోకింది. లక్ష 34 వేల 603 మంది మరణించారు. అయితే 5 లక్షల 10 వేల 171 మంది రోగులు ఆరోగ్యంగా మారడం ఉపశమనం కలిగించే విషయం.

ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల 83 వేల 33 మందికి కరోనావైరస్ సోకింది. లక్ష 34 వేల 603 మంది మరణించారు. అయితే 5 లక్షల 10 వేల 171 మంది రోగులు ఆరోగ్యంగా మారడం ఉపశమనం కలిగించే విషయం.జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం, యుఎస్ లో 24 గంటల్లో 2,600 మంది మరణించారు. ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 30 వేల 844 మంది మరణించారు. అదే సమయంలో దేశంలో ఇప్పటివరకు ఆరు లక్షల 38 వేల సంక్రమణ కేసులు నమోదయ్యాయి.

ఇక స్పెయిన్లో బుధవారం 557 మంది మరణించారు.. అలాగే 6 వేల 599 కొత్త కేసులు కనుగొనబడ్డాయి. ఇప్పటివరకు 18 వేల 812 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం లక్ష 80 వేల 659 మందికి వైరస్ సోకింది. ప్రస్తుతం గతంకంటే కూడా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. కొన్ని వ్యాపారాలు తిరిగి ప్రారంభించబడ్డాయి, దీనివల్ల ఆర్థిక వ్యవస్థ కొంత ఊపందుకుంది. తయారీ, నిర్మాణం పనులు ప్రారంభం అయ్యాయి, కాని కఠినమైన భద్రతా మార్గదర్శకాలను పాటించాలి.

కెనడాలో ఇప్పటివరకు 28 వేల 379 కేసులు నమోదయ్యాయి, 1,010 మంది మరణించారు. యుఎస్ మరియు యూరోపియన్ దేశాల కంటే ఇక్కడ తక్కువ మరణాలు సంభవించాయి.

ఇదిలావుంటే కరోనాతో ఇబ్బందులు పడుతోన్న ప్రపంచంలోని అత్యంత పేద దేశాలకు తాత్కాలిక రుణాలు అందించే జి 20 గ్రూప్ నిర్ణయాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) , ప్రపంచ బ్యాంక్ స్వాగతించాయి. "ప్రపంచంలోని మిలియన్ల మంది పేద ప్రజల జీవితాలను, జీవనోపాధిని కాపాడటానికి ఇది శక్తివంతమైన ప్రయత్నం" అని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ మాలాగ్ మరియు ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టినా జార్జివా బుధవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories