Top
logo

కోడిపెట్ట కోటీశ్వరురాలు.. ఎలా అయిందబ్బా!

కోడిపెట్ట కోటీశ్వరురాలు.. ఎలా అయిందబ్బా!
X
Highlights

కోడిపెట్ట కోటీశ్వరురాలు ఏంటీ.. మీరు మరీనూ.. చదివేవాళ్లు ఉండాలే కానీ రాసేవాళ్లు ఎదైనా రాస్తారులే...

కోడిపెట్ట కోటీశ్వరురాలు ఏంటీ.. మీరు మరీనూ.. చదివేవాళ్లు ఉండాలే కానీ రాసేవాళ్లు ఎదైనా రాస్తారులే అనుకుంటున్నారా..? అయ్యో.. ఇది నిజంగా నిజమండి బాబు.ఒకటి కాదు రెండు కాదు ఎకంగా రూ. 105 కోట్ల సంపదకు వారసురాలు. ఇంతకీ ఆ కోడిపెట్ట కథా.. కమామీషు తెలుసుకుందామా..!

బ్రిటన్‌కు చెందిన మైల్స్ బ్లాక్ వెల్‌కు పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ వాటితోనే గడుపుతూ కాలక్షేపం చేస్తుండేవాడు. బ్రిటీషు సంపన్నుడు అయిన మైల్స్‌కు వాటి గురించే ఎప్పుడూ ఆలోచిస్తుండేవాడు. ఒకవేళ తను చనిపోతే.. తననే నమ్ముకున్నమూగజీవుల కోసం పరిస్థితి ఏంటా అని ఆలోచన వచ్చిందట. వెంటనే తన లాయర్‌ని పిలిపించి తన తదనంతరం ఆస్తి మొత్తం కోడిపెట్టకి చెందేలా వీలునామా రాయించాడు. 2011వ సంవత్సరంలో మైల్స్ బ్లాక్ కన్నుమూయడంతో.. కోడిపెట్ట కోటీశ్వరురాలైంది. అలా ఈ బ్రిటన్ కోడిపెట్ట రూ.105 కోట్లు‌కు వారసురాలు అయింది.

Next Story