అచ్చం క్రికెట్ బ్యాటింగ్ లా ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడుతున్న కరోనా!

అచ్చం క్రికెట్ బ్యాటింగ్ లా ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడుతున్న కరోనా!
x
Highlights

కరోనావైరస్ మూడక్షరాలతో ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనా వ్యాప్తి ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉందంటే.. క్రికెట్ లో వన్డే / ట్వంటీ ట్వంటీ బ్యాటింగ్ లో...

కరోనావైరస్ మూడక్షరాలతో ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనా వ్యాప్తి ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉందంటే.. క్రికెట్ లో వన్డే / ట్వంటీ ట్వంటీ బ్యాటింగ్ లో కొందరు బ్యాట్స్ మెన్ చేసే పరుగుల శైలిని పోలి వుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది వాస్తవం. ఉదాహరణకు మన దేశపు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్దేలలో బ్యాటింగ్ చేసేటప్పుడు మొదటి 50 పరుగులు చేయడానికి దాదాపుగా60 బంతులు అవసరం అవుతాయి. తరువాతి 30 బంతుల్లో సెంచరీ పూర్తి అయిపోతుంది. ఇక మరో 20 బంతులు ఆడే అవకాశం ఉంటె 150 పరుగులు వచ్చేస్తాయి. ఇక ఆ స్పీడును ఆపడం ఎవరి వల్లా కాదు. సరిగ్గా ఇలానే కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా మానవాలిపై విరుచుకు పడింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చెబుతున్న వివరాల ప్రకారం డిసెంబర్‌లో వైరస్‌ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి వైరస్‌ బాధితుల సంఖ్య లక్ష చేరుకోవడానికి 67 రోజులు పట్టింది. రెండో లక్షను తాకడానికి 11 రోజులు పడితే, మూడో లక్షను దాటడానికి కేవలం నాలుగు రోజులే పట్టింది. ఈ వేగం చూస్తుంటే గుండె ఆగిపోవడం లేదూ.

ఇక తాజాగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. అయినా దీన్ని కట్టడి చేయడం సాధ్యమేనని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 16 వేలు దాటగా.. బాధితుల సంఖ్య నాలుగు లక్షలకు చేరువైంది.

ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ ట్రెడ్రోస్‌ అధనోమ్‌ కరోనా వైరస్ వ్యాప్తిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ వెలుగులోకి వచ్చిన కేసులు వాస్తవ కేసులతో పోలిస్తే చాల తక్కువని అయన చెప్పారు. వెలుగులోకి రాని కేసులు చాలా ఎక్కువ ఉన్నాయని అయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఈ మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని అయన అన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ కరోనా వైరస్ తో పోరాటాన్ని ఫుట్ బాల్ ఆటతో పోల్చారు. ఫుట్‌బాల్‌ ఆటలో కేవలం డిఫెండ్‌ మాత్రమే కాకుండా అటాక్‌ కూడా చేస్తేనే గెలుస్తామని అదే స్ఫూర్తితో కరోనాపై కూడా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ సామాజిక దూరం, ఇంటికి పరిమితం కావడం వంటి చర్యలు తప్పక పాటించాల్సిందేనని పునరుద్ఘాటించారు. అయితే కేవలం ఈ చర్యలు పాటిస్తే సరపోదని అభిప్రాయపడ్డారు. కరోనాపై పోరులో గెలవాలంటే మరింత విస్తృత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ''ప్రతి అనుమానిక కేసుకి వైద్య పరీక్షలు నిర్వహించాలి. నిర్ధారణ అయిన ప్రతి వ్యక్తితో పాటు వారిని కలిసి వారిని నిర్బంధంలో ఉంచాలి'' అని సూచించారు.

ఇక ఇప్పటివరకూ ఏ చికిత్సా కరోనాని నయం చేయగలదాని ధ్రువీకరించలేదని చెప్పిన అయన కరోనా వైరస్ కు విరుగుడు కనిపెట్టడం కోసం విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. కొన్ని చోట్ల యాంటీమలేరియా ఔషధం కరోనా చికిత్సతో వినియోగిస్తున్నారన్న టేద్రోస్ వైద్యులు సూచించని మందులు వాడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ప్రజలకు సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories