ఇలా చేస్తే మరో మారు కరోనా విజృంభిస్తుంది : టెడ్రోస్‌

ఇలా చేస్తే మరో మారు కరోనా విజృంభిస్తుంది : టెడ్రోస్‌
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరింత తీవ్ర రూపం దాలుస్తుందని, ప్రపంచ దేశాల పరిస్థితి మరింత విషమించబోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)...

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరింత తీవ్ర రూపం దాలుస్తుందని, ప్రపంచ దేశాల పరిస్థితి మరింత విషమించబోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ సోమవారం మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆదివారం నమోదైన కేసుల్లో అత్యధికం కేవలం 10 దేశాల నుంచే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐరోపా దేశాల్లో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఉభయ అమెరికా ఖండాలతో పాటు దక్షిణాసియా దేశాల్లో కేసుల సంఖ్య క్రమంగా రెట్టింపు అవుతున్నాయని తెలిపింది. ఆఫ్రికా దేశాల్లో వైరస్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తుందని టెడ్రోస్‌ పేర్కొన్నారు.

చాలా దేశాల్లో కేసుల సంఖ్య వెయ్యికి తక్కువగానే ఉన్నప్పటికీ కొత్త ప్రాంతాలకు రోజురోజుకీ విస్తరిస్తోందని తెలిపారు. ప్రస్తుతం కొన్ని దేశాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని, కానీ ఆయా దేశాల ప్రజలు ఎంతమేర నిబంధనలకు కట్టుబడి ఉంటారన్నది సవాల్‌గా మారిందన్నారు. కొన్నిదేశాల్లో సామూహిక నిరసనలు కొనసాగుతుండడం పట్ల విచారం వ్యక్తం చేశారు. వాటి కారణంగా మారోమారు మహమ్మారి విజృంభించేందుకు కారణమవుతుందని హెచ్చరించారు. అమెరికాలో ఆఫ్రో-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యక్తవుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జాతి సమానత్వం దిశగా సాగే పోరాటానికి డబ్ల్యూహెచ్‌ఓ మద్దతు ఉంటుందని టెడ్రోస్‌ హామీ ఇచ్చారు. గడచిన 9 రోజుల్లో లక్షకు పైగా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఆదివారం అత్యధికంగా 1,36,000 కేసులు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories