కొత్త రకం కరోనాపై డబ్ల్యూహెచ్‌వో కీలక వ్యాఖ్యలు

కొత్త రకం కరోనాపై డబ్ల్యూహెచ్‌వో కీలక వ్యాఖ్యలు
x
Highlights

* కొత్తరకం కరోనా అదుపు చేయాలంటే నిబంధనలు పాటిస్తే చాలు- WHO * అజాగ్రత్త వహిస్తే ప్రమాదం తప్పదు- WHO * కొత్త రకం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది- WHO * కొన్ని విషయాల్లో కాస్త కఠినంగా ఉండాలి- WHO

బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనాపై కీలక వ్యాఖ్యలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇప్పటి వరకు కొత్త రకం వ్యాప్తి అదుపు తప్పలేదని స్పష్టం చేసింది. కరోనా కట్టడికి తొలి నుంచి అనుసరిస్తున్న విధానాలనే పాటిస్తే దీన్ని నియంత్రించ వచ్చని తెలిపింది. అజాగ్రత్త వహిస్తే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తూ.. అప్రమత్తంగా ఉంటూ కరోనా నిబంధనల్ని పాటించాలని సూచించింది. కొన్ని విషయాల్లో మరింత కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందంది.

రూపుమార్చుకున్న కరోనా వైరస్‌ ఇప్పటి వరకు కాస్త రూపు మార్చుకున్న ఈ నూతన వైరస్‌ ప్రస్తుతానికి బ్రిటన్‌తోపాటు మరో 4-5 దేశాల్లో వెలుగుచూసింది. అయితే కొత్త రకం కరోనా వైరస్‌ ఇంతకుముందు వైరస్‌తో పోలిస్తే 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోందన్న వార్త ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తోంది. ముఖ్యంగా బ్రిటన్‌ పేరెత్తితేనే అంతర్జాతీయ సమాజం వణికిపోతోంది. భారత్‌ సహా అనేక దేశాలు ముందుజాగ్రత్త చర్యగా ఆ దేశానికి విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories