ఇలా చేయకుంటే 26 కోట్ల మంది ప్రజలు ఆకలి అంచున ఉంటారు : డబ్ల్యుఎఫ్‌పి

ఇలా చేయకుంటే 26 కోట్ల మంది ప్రజలు ఆకలి అంచున ఉంటారు : డబ్ల్యుఎఫ్‌పి
x
World Food Programme (WFP)
Highlights

ప్రపంచంలో 25 లక్షల 56 వేల 725 మందికి కరోనావైరస్ సోకింది. లక్ష 77 వేల 618 మంది మరణించగా, ఆరు లక్షల 90 వేల 329 మంది నయమయ్యారు.

ప్రపంచంలో 25 లక్షల 56 వేల 725 మందికి కరోనావైరస్ సోకింది. లక్ష 77 వేల 618 మంది మరణించగా, ఆరు లక్షల 90 వేల 329 మంది నయమయ్యారు. అంటువ్యాధి కారణంగా ప్రపంచంలోని అనేక దేశాలలో కరువు వచ్చే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి) అధిపతి డేవిడ్ బీస్లీ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న దేశాలలో 30 కి పైగా

దేశాలలో విస్తృతంగా కరువు రాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ సంక్షోభం కారణంగా, సుమారు 26.5 కోట్ల మంది ప్రజలు ఆకలి అంచున ఉంటారు. ఆర్థిక సంక్షోభం , వాతావరణ మార్పులతో ఎక్కువగాప్రభావితమైన 10 దేశాలు ఎక్కువగా ముప్పు పొంచి ఉన్నాయని డబ్ల్యుఎఫ్‌పి తెలిపింది.

యెమెన్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఆఫ్ఘనిస్తాన్, వెనిజులా, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సుడాన్, సిరియా, నైజీరియా , హైతీ దేశాలు ప్రపంచ నాల్గవ ఆహార సంక్షోభం వార్షిక నివేదికలో చేర్చబడ్డాయి. ఈ నివేదిక ప్రకారం, దక్షిణ సూడాన్లో 61% జనాభా గత సంవత్సరం ఆహార సంక్షోభం కారణంగా ప్రభావితమైంది. మహమ్మారికి ముందు తూర్పు ఆఫ్రికా మరియు దక్షిణ ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే తీవ్రమైన ఆహార సంక్షోభం ఉంది. ఇదిలావుంటే అమెరికా రాష్ట్రమైన మిస్సౌరీ కరోనా విషయంలో చైనాపై సివిల్ కేసు దాఖలు చేసింది. అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ విషయంలో చైనాపై నిరంతరం దాడి చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories