World Biryani Day: బుక్కమధ్యలో ముక్క..! ఆ ముక్క లెగ్ పీస్ అయితే...ఆహా.. ఇక పండగే..!

World Biryani Day | Telugu News
x

World Biryani Day: బుక్కమధ్యలో ముక్క..! ఆ ముక్క లెగ్ పీస్ అయితే...ఆహా.. ఇక పండగే..!

Highlights

World Biryani Day: హైదరాబాద్ దమ్ బిర్యానీ.. ఇదొక్కటి చాలు... ఎవ్వరికైనా నోరూరడానికి..!

World Biryani Day: మంచిగా తినాలనిపిస్తోంది. ఎంత తిన్నా.. ఎన్నిసార్లు తిన్నా... మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. పార్టీలో సైతం దానికోసం నాలుక లబలబలాడిపోతుంది. అదున్న చోటుకే ప్రాణం లాగేస్తుంది. బుక్క బుక్కకు నంజుకుతింటుంటే గాల్లో తేలినట్టు ఉంటుంది. పగలు, రాత్రితో సంబంధం లేదు. ప్రాంతంతో పని లేదు. ఖండాలు దాడినా.. దానిపై కోరిక మాత్రం చావదు. అదే బిర్యానీ..! వరల్డ్ బిర్యానీ డే సందర్భంగా hmtv ప్రత్యేక కథనం...

బుక్కమధ్యలో ముక్క..! ఆ ముక్క లెగ్ పీస్ అయితే...ఆహా.. ఇక పండగే..! వేడుక ఏదైనా బిర్యానీ మాత్రం పక్కా ఉండాల్సిందే..! ఉదయం తిన్నా మధ్యాహ్నం మళ్లీ తినాలని.. మధ్యాహ్నం తిన్నా రాత్రికీ తినాలని... ఎన్నీ సార్లు తిన్నా మళ్లీ మళ్లీ మంచిగా తినాలని... ఈ హోటల్‌లో తింటే ఈ సారి ఇంకో హోటల్‌కు వెళ్లి రుచిని ఆస్వాధించాలని బిర్యానీ లవర్స్ అనుకుంటారు. ఇంతలా మరే ఫుడ్ గురించి జనాలు ఆలోచించరు. అంతెందుకు.. ఓ సర్వేలో దేశంలో ప్రజలు ఎక్కువగా తినే ఐటమ్ బిర్యానీనే అని తేలింది.

హైదరాబాద్ దమ్ బిర్యానీ.. ఇదొక్కటి చాలు... ఎవ్వరికైనా నోరూరడానికి..! దీనికి తోడు.. పచ్చిమిర్చి బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, చిట్టిముత్యాల కోడి బిర్యానీ, నాటుకోడి బిర్యానీ, మొగలాయ్ బిర్యానీ, గోంగూర బిర్యానీ, కుండ బిర్యానీ, బ్యాంబూ చికెన్ బిర్యానీ ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్‌లో ఓ వంద రకాల బిర్యానీలను నిత్యం జనాలు ఆస్వాధిస్తు్ంటారు. అందుకే వంటకాల్లో బిర్యానీని కొట్టే ఐటమ్ మరోటి లేదు.. రాదు.

హైదరాబాద్‌లో గల్లీకో బిర్యానీ సెంటర్ ఉన్నా... ప్రతీ హోటల్‌లో ఏదో ఓ వెరైటీ బిర్యానీ ఉంటుంది. ఏ హోటల్‌కు ఆ హోటలే ప్రత్యేకంగా నిలుస్తుంటుంది. అంతెందుకు నగరంలో బిర్యానీకి మించి మరే ఐటమ్ ఎక్కువగా అమ్ముడుపోదంటే అతిషయోక్తి కాదు. వెజ్ రెస్టారెంట్స్‌లో సైతం వెజిటెబుల్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ అని చాలా రకాలు బిర్యానీలు ఉంటాయి. అసలు బిర్యానీ లేనిదే హైదరాబాద్ వాసులకు రోజు గడవదు. హైదరాబాదీస్ అంటేనే బిర్యానీ లవర్స్... ఆ మాటకొస్తే దేశంలో బిర్యానీ నచ్చనివారు.. ఆ రెసిపీని మెచ్చని వారే ఉండరు.

ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్సే అయినా... రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో తయారు చేసే బిర్యానీలు వహ్‌వా అనిపిస్తాయి. గుంటూరు బిర్యానీ, నెల్లూరు నాటుకోడి బిర్యానీ, గోదావరి జిల్లాలో దొరికే పులావ్ స్టైల్.. బిర్యానీ ఇలా చాలా పేరొందిన బిర్యానీలు ఏపీలో సైతం ఉన్నాయి. జిహ్వకో రుచి అన్నట్లు... ఊరికో రకం బిర్యానీ.. ఫుడ్డీస్‌ను రారారమ్మని నోరూరిస్తుంటుంది.

మనుషులు ప్రాంతాలు మారినట్లే... నువ్వెక్కడుంటే నేనక్కడుంటానంటూ బిర్యానీ మన వెంటే వచ్చేసింది. హైదరాబాద్‌‌కు వచ్చి ఇక్కడి బిర్యానీ తిని.. తిరిగి సొంతూళ్లకు వెళ్లి అక్కడ బిర్యానీ చేసుకుని తింటూ... నాలుకపై ఉన్న రుచికలికలను తట్టిలేపుతుంటారు. అలా.. అలా.. దేశంలో పలు ప్రాంతాలకు విస్తరించిన బిర్యానీ... చంపారన్ బిర్యానీగా, డోన్నే బిరియానీగా, కోల్‌కత్తా బిరియానీగా రూపాంతరం చెందింది. పేరు ఏదైనా... దాని అసలు సిసలు రుచి మాత్రం హైదరాబాద్ బిర్యానీకి చెందినదే కావడంతో జనాలు ఎగబడి తింటుంటారు.

అమెరికా మొదలుకొని ఆఫ్రికా వరకు ఇప్పుడు అన్ని దేశాల్లో బిర్యానీ దొరుకుంతుందంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఏ విధంగా బిర్యానీ వండుకున్నా.. హైదరాబాద్ దమ్ బిర్యానీ మాత్రం వరల్డ్ ఫేమస్. చికెన్, మటన్... ఇలా నాన్ వెజ్ ఏదైనా పేరు చివర బిర్యానీ చేరకపోతే దానికి పరిపూర్ణత లేనట్టేనని భోజనప్రియులంటుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories