ఆస్కార్ వేడుకల్లో షాకింగ్ ఘటన.. విల్‌స్మిత్ భార్యపై క్రిస్‌రాక్ జోకులు.. చెంపదెబ్బ కొట్టి...

Will Smith Slaps Chris Rock after Joke about His Wife Jada Pinkett | Oscar Awards 2022
x

ఆస్కార్ వేడుకల్లో షాకింగ్ ఘటన.. విల్‌స్మిత్ భార్యపై క్రిస్‌రాక్ జోకులు.. చెంపదెబ్బ కొట్టి...

Highlights

Oscar Awards 2022: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఓ అనూహ్య ఘటన జరిగింది...

Oscar Awards 2022: ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఓ అనూహ్య ఘటన జరిగింది. ఆనందం, భావోద్వేగాల మధ్య సాగే ఈ వేడుకల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ అందరినీ విస్మయానికి గురి చేసింది. మొదట అందరూ షోలో భాగంగానే ఆటపట్టించడానికి జరుగుతున్న ఘటన అని భావించినప్పటికీ, తర్వాత అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు.

అమెరికాకు చెందిన ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్ అకాడమీ అవార్డుల వేడుకకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు ప్రకటించడానికి ముందు ఆయన నవ్వుల్లో ముంచెత్తేందుకు ఓ కామెడీ ట్రాక్ ను చెప్పుకొచ్చారు. అందులో ప్రముఖ నటుడు విల్ స్మిత్ సతీమణి జాడా పింకెట్ ప్రస్తావనను తీసుకొచ్చారు. అప్పటి వరకు క్రిస్ జోక్ లకు నవ్వుతూ కనిపించిన స్మిత్.. ఒక్కసారిగా లేచి వేదికపైకి నడుచుకుంటూ వెళ్లి, క్రిస్ చెంప చెళ్లుమనిపించి వెనుదిరిగారు. అంతేకాదు వెనక్కి వచ్చిన స్మిత్ తన కుర్చీలో కూర్చుని క్రిస్ పై గట్టిగా అరిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories