భ‌ర్త ద‌గ్గ‌ర డ‌బ్బులు కొట్టేసేందుకు ఈ భార్య ఏం చేసిందో తెలుసా..!

Wife who Lied about being Kidnapped and Wanted to Steal Money from her Husband
x

Representation Photo

Highlights

* త‌న భ‌ర్త ద‌గ్గ‌ర నుంచి డ‌బ్బులు కొట్టేయాల‌నుకున్న ఈ భార్య జూదానికి బానిసైంది.

Spain Women: స్పెయిన్‌లో ఓ మ‌హిళ భ‌ర్తని దారుణంగా మోసం చేసింది. డ‌బ్బుల కోసం ఏకంగా కిడ్నాప్ డ్రామా ఆడింది. చివ‌ర‌కు పోలీసుల‌కు దొరికిపోయి క‌ట‌క‌టాల‌పాలైంది. సొంత భ‌ర్త‌నే మోసం చేసి డ‌బ్బులు గుంజాల‌నుకుంది. ఈ ఘ‌ట‌న ద్వారా రోజు రోజుకు వ్య‌క్తుల మ‌ద్య సంబంధాలు ఎంత కిందికి దిగ‌జారిపోతున్నాయో అర్థ‌మ‌వుతుంది. డ‌బ్బుల కోసం ఏదైనా చేస్తున్నారు. మనీ ప్ర‌పంచం అయిపోయింది. మాన‌వ సంబంధాల‌కు విలువ లేకుండా పోయింది.

అయితే త‌న భ‌ర్త ద‌గ్గ‌ర నుంచి డ‌బ్బులు కొట్టేయాల‌నుకున్న ఈ భార్య జూదానికి బానిసైంది. కానీ మరోవైపు ఆమె భర్త అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో ఆమె తనను కొంతమంది కిడ్నాప్ చేశారని రూ.5 లక్షలు ఇస్తే వ‌దిలేస్తా అంటున్నార‌ని ఒక డ్రామా ప్లే చేసింది.

పాపం ఈ విష‌యం తెలియ‌ని భ‌ర్త నిజ‌మే అనుకొని, త‌న ఆరోగ్యం కోసం చూసుకోకుండా వెంట‌నే ఆమె కోరిన మొత్తాన్ని భార్యకు పంపించాడు. ఏం జ‌రుగుతుందో తెలియ‌ని భ‌ర్త ఎందుకైనా మంచిద‌ని భార్య‌ని కాపాడుకునేందుకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. త‌న భార్య‌వివ‌రాలు, మొబైల్ నెంబ‌ర్, ఇత‌ర ఐడెంటి గురించి తెలిపాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

అయితే అత‌డి భార్య అనుకోకుండా ఒక షాపింగ్‌ మాల్‌లోకి ప్రవేశిస్తుండగా పోలీసులు చూశారు. అనుమానం వచ్చి రెడ్ ఫాలో చేయ‌గా అస‌లు విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. దీంతో ఆమెని రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకొని అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయాలు వెల్లడించింది. తాను డబ్బుల కోసమే ఇలా చేశానని చెప్పింది. దీంతో పోలీసులు జరిగిన విషయాన్ని ఆ మహిళ భర్తకు తెలియజేశారు. ప్రస్తుతం ఆ మహిళ బెయిల్‌పై విడుదలైనప్పటికీ కేసు విచారణ కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories