Lex Fridman's History: మోదీని ఇంటర్వ్యూ చేసిన పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మన్ ఎవరు? ఆయన కేపబిలిటీ ఏంటి?

Who is Lex Fridman, where he is from and why Indian PM Modi gave podcast interview to him
x

Lex Fridman's History: మోదీని ఇంటర్వ్యూ చేసిన పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మన్ ఎవరు? ఆయన కేపబిలిటీ ఏంటి?

Highlights

Who is Lex Fridman: ప్రధాని నరేంద్ర మోదీ ఒక విదేశీ పాడ్ కాస్టర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అది కూడా అరగంట, గంట కాదు... ఏకంగా మూడుగంటలపాటు ఈ పాడ్‌కాస్ట్...

Who is Lex Fridman: ప్రధాని నరేంద్ర మోదీ ఒక విదేశీ పాడ్ కాస్టర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అది కూడా అరగంట, గంట కాదు... ఏకంగా మూడుగంటలపాటు ఈ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ జరిగింది. ఇంతకీ ఈ విదేశీ పాడ్ కాస్టర్ ఎవరు? ఆయనకు మోదీ ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చారు?

ప్రపంచంలోనే సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన దేశాధినేతగా మోదీకి పేరుంది. మరి అలాంటి మోదీ ఒక పాడ్‌కాస్ట్‌లో గెస్ట్‌గా కనిపించేందుకు ఒప్పుకున్నారంటే ఆయన్ను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తికి ఉన్న శక్తి సామర్థ్యాలు ఏంటనే సందేహం చాలామంది మెదళ్లను తొలిచేస్తోంది.

ఎవరీ లెక్స్ ఫ్రిడ్‌మన్?

లెక్స్ ఫ్రిడ్‌మన్ అమెరికాలో ఒక కంప్యూటర్ సైంటిస్ట్. పేరున్న పాడ్‌కాస్టర్ కూడా. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్శిటీలో రిసెర్చ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. లెక్స్‌కు కంప్యూటర్లతో, రోబోలతో ప్రయోగాలు చేయడం అంటే ఎంత ఇష్టమో... ఎదుటివారితో సంభాషించడం కూడా అంతే ఇష్టం. అందుకే ఆయన గొప్ప పాడ్‌కాస్టర్‌గానూ రాణిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్

1) యూట్యూబ్ - 4.59 మిలియన్స్ సబ్‌స్క్రైబర్స్

2) ట్విటర్ - 4.2 మిలియన్ ఫాలోవర్స్

3) ఇన్‌స్టాగ్రామ్ - 1.5 మిలియన్ ఫాలోవర్స్

4) ఫేస్‌బుక్ - 1.91 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

ఇవే కాకుండా టిక్ టాక్, రెడిట్ లాంటి ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ లెక్స్ ఫ్రిడ్‌మన్‌కు భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు.

లెక్స్ ఇప్పటివరకు ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశారు?

బిలియనేర్ బిజినెస్‌మేన్ ఎలాన్ మస్క్ ఇప్పటివరకు లెక్స్ ఫ్రిడ్‌మన్‌కు నాలుగుసార్లు ఇంటర్వ్యూ ఇచ్చారు. అమెరికాలో ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత కూడా మస్క్ ఆయన పాడ్‌కాస్ట్ షోలో పాల్గొన్నారు. మస్క్ తన జీవితంలో బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను లెక్స్ షోలో పంచుకున్నారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా లెక్స్ ఫ్రిడ్‌మన్ పాడ్‌కాస్ట్ షోకు అతిథిగా హాజరై ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీని కూడా లెక్స్ ఇంటర్వ్యూ చేశారు. ఈ పాడ్‌కాస్ట్ షోలో రష్యా - ఉక్రెయిన్ యుద్ధం గురించి ఎన్నో విషయాలను జెలెన్‌స్కీ నుండి లెక్స్ అడిగి తెలుసుకున్నారు. ఆ విషయాలను లెక్స్ తన ఆడియెన్స్‌తో పంచుకున్నారు.

కెనడాకు చెందిన సైకాలజిస్ట్, రచయిత జోర్డన్ పీటర్సన్‌తో పాటు ఎంతోమంది సైంటిస్టులు, మేధావులను ఇంటర్వ్యూ చేసిన అనుభవం లెక్స్ ఫ్రిడ్‌మన్ సొంతం. కానీ తన జీవితం మొత్తంలో ఇదే చాలా కీలకమైన పాడ్‌కాస్ట్ షోగా లెక్స్ అభివర్ణించారు.

మోదీపై గౌరవంతో 2 రోజులుగా లెక్స్ ఉపవాసం

అంతేకాదు... మోదీతో పాడ్‌కాస్ట్ కంటే ముందుగా 45 గంటల నుండి తను ఉపవాసం చేస్తున్నట్లు తెలిపారు. కేవలం ప్రధాని మోదీతో ఆలోచన రేకెత్తించేలా చక్కటి సంభాషణ కోసమే తను ఫాస్టింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఏకాగ్రత పెంచుకోవడం కోసం, ఆధాత్మిక టచ్ కోసం ఉపవాసంలో ఉన్నట్లు తెలిపారు. గత 2 రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా కేవలం నీరుపైనే ఉన్నానని అన్నారు. ప్రధాని మోదీకి గౌరవసూచకంగా తను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

లెక్స్ ఫ్రిడ్ మన్ చెప్పిన విషయం విని ప్రధాని మోదీ ఎంతో ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అది కూడా తనపై గౌరవంతో ఉపవాసం చేస్తున్నానని లెక్స్ చెప్పడంతో ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ఉపవాసంతో కలిగే ప్రయోజనాలను, తన అనుభవాలను కూడా లెక్స్‌తో పంచుకున్నారు.

ప్రధాని మోదీతో లెక్స్ ఫ్రిడ్‌మన్ పాడ్‌కాస్ట్ షోలో ప్రస్తావనకొచ్చిన వివాదాలు, సంచలన విషయాలు ఏంటో తెలియాలంటే ఇదిగో ఆ ఫుల్ వీడియో

Gold Rate: రూ. 64 నుంచి 90,000 దాకా బంగారం ధర ఎలా పెరిగింది? ఇంకెంత పెరుగుతుంది?

Show Full Article
Print Article
Next Story
More Stories