కరోనా తగ్గుముఖం పట్టేవరకు లాక్‌డౌన్ సడలించొద్దు : డబ్ల్యూహెచ్‌ఓ


దేశంలో కరోనా విజృంభణ వేళ లాక్‌డౌన్ మరో రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
దేశంలో కరోనా విజృంభణ వేళ లాక్‌డౌన్ మరో రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.అంతేకాకుండా ఆరంజ్ జోన్, గ్రీన్ జోనల్లో సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించింది. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు లాక్‌డౌన్ ఆంక్షలు సడలించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
అయితే పలు దేశాలు సడలింపులు ఇస్తోన్న విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) స్పందించింది. ఈ సందర్భంగా పలు హెచ్చరికలు చేసింది. దేశాల్లో లాక్‌డౌన్ నిబంధనల్ని ఎత్తివేసే విషయంపై బాగా ఆలోచించుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగ సీనియర్ అధికారి డాక్టర్ మైక్ ర్యాన్ అన్నారు.
లాక్‌డౌన్ సడలింపులు ఇస్తున్న చాలా దేశాల్లో కేసులు ఒక్కసారిగా పెరిగాయని తెలిపారు. ఇటువంటి సమయంలో వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో నిబంధనలు ఎత్తివేయడం వల్ల మళ్లీ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితులు ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల్లో అధికంగా ఉన్నాయన్నారు.
కోవిడ్ అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరం, లాక్‌డౌన్ వంటి చర్యలు మాత్రమే కరోనాను కట్టడి చేస్తాయని తెలిపారు. భారత్‌తో పాటు అమెరికా లాంటి దేశాలు ఒకవేళ నిబంధనలను సడలిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటాయని హెచ్చరించారు. కాగా, కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రస్తుతం పలు దేశాలు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని తెలిపారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



