ట్రంప్‌ కరోనా టెస్టులు చేయించారంటూ ఊహాగానాలు

ట్రంప్‌ కరోనా టెస్టులు చేయించారంటూ ఊహాగానాలు
x
Trump Corona Test
Highlights

ట్రంప్ కరోనా పరీక్షలు చేయించుకున్నారనే వార్తలను వైట్ హౌస్ అధికారులు కొట్టిపారేశారు.

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ ఇరాన్, ఇటలీ, దక్షిణ కొరియా దేశాల్లో ఎంతో మందిని బలితీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం వ్యాప్తంగా 3,800 మంది మరణించారు. లక్షాపదివేల మంది కోవిడ్ బారిన పడ్డారు. ఇక భారత్‌లో కరోనా బారిన పడ్డవారి సంఖ్య 44కు చేరింది. అమెరికా కూడా కొవిడ్‌-19తో వణికిపోతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా పరీక్షలు చేయించుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన సమావేశాల్లో కరోనా సోకిన ప్రతినిధులు ట్రంప్‌ని కలిశారన్న నేపథ్యంలో ఇలాంటి ఊహాగానాలు వెలువడుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైద్యపరీక్షలు చేయించుకున్నారన్న వార్తలపై ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ స్పందించారు. ట్రంప్ కరోనా పరీక్షలు గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. వైట్ హౌస్ వైద్యాధికారి నుంచి ఎలాంటి సమాచారం లేదని, అలాంటి ప్రకటన వస్తే నిర్థారించగలమని స్పష్టం చేశారు. ట్రంప్‌ను కలిసినప్పుడు వారికి కరోనా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. వైద్య పరీక్షలపై నుంచి వైట్ హౌస్ సమాధానం వచ్చేలా చూస్తామని మైక్ పెన్స్‌ చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి పరీక్షలు తాను ఎలాంటి పరీక్షలు చేయించుకోలేదని స్పష‌్టం చేశారు.

ట్రంప్ కరోనా పరీక్షలు చేయించుకున్నారనే వార్తలను వైట్ హౌస్ అధికారులు కొట్టిపారేశారు. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు. అమెరికాలో కరోనా వైరస్‌ వల్ల ఇప్పటి వరకు 24 మంది మృత్యువాత పడ్డారు. కరోనా బాధితులుగా మొత్తం 514 మంది మారారు. కాలిఫోర్నియా 'గ్రాండ్‌ ప్రిన్సెస్‌' నౌక నుంచి ప్రయాణికుల బృందాన్ని బయటకు తీసుకొచ్చారు. వారిని వైద్య పర్యవేక్షణలో ఉంచనున్నారు. ఇక మరో 900 మందిని మంగళవారం విడుదల చేస్తారని సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories