WhatsApp : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సరికొత్త ఫీచర్ వచ్చేసింది

WhatsApp : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సరికొత్త ఫీచర్ వచ్చేసింది
x
Highlights

రోజూ పొద్దున్న లేవగానే.. అందరికి వాట్సాప్‌ చూడటం సర్వసాధరణం అయిపోయింది. రాత్రి పొద్దుపోయాక అందులో ఏమేమి సమాచారం వచ్చిందో తెలుసుకునేందుకు పొద్దున్నే...

రోజూ పొద్దున్న లేవగానే.. అందరికి వాట్సాప్‌ చూడటం సర్వసాధరణం అయిపోయింది. రాత్రి పొద్దుపోయాక అందులో ఏమేమి సమాచారం వచ్చిందో తెలుసుకునేందుకు పొద్దున్నే వాట్సాప్ తో కుస్తీ పడుతుంటారు. అయితే ఆ సమయంలో ఒక్కసారిగా వాట్సాప్ ఓపెన్ చెయ్యగానే కళ్ళకు బ్రైట్ నెస్ ఎక్కువగా కనపడటంతో చికాకు పడుతుండారు. ఆ సమయంలో ఇందులో డార్క్ మోడ్ ఉంటే బాగుండును అని ఫీల్ అవుతుంటారు.. ఇప్పుడు అలా ఫీల్ అయ్యేవారికి వాట్సాప్ శుభవార్త అందించింది. అందులో డార్క్ మోడ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకనుంచి ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్‌ లలో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లు డార్క్ మోడ్‌ అనుభూతిని పొందవచ్చని. గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్‌లో వాట్సాప్ యొక్క తాజా వెర్షన్‌తో ఈ ఫీచర్ విడుదలవుతోందని వాట్సాప్ తెలిపింది.

డార్క్ మోడ్ ముఖ్యంగా "స్క్రీన్ యొక్క ప్రకాశాన్ని తగ్గిస్తుంది, కాంతిని తగ్గిస్తుంది మరియు కాంట్రాస్ట్ మరియు రీడబిలిటీని మెరుగుపరుస్తుంది" అని చెప్పింది. గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్‌లోని తాజా వెర్షన్‌కు వాట్సాప్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత, వినియోగదారులు వాట్సాప్ సెట్టింగులు > చాట్స్> థీమ్ > డార్క్ ను ఎంపిక చేసుకోవడం ద్వారా డార్క్ మోడ్‌ను ఆన్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ 10 మరియు ఐఓఎస్ 13 లోని వాట్సాప్ యూజర్లు డార్క్ మోడ్ కోసం 'సిస్టమ్ డిఫాల్ట్' ను కూడా ఎంచుకోవచ్చు. అంటే ఫోన్‌లోని సిస్టమ్ డిఫాల్ట్ సెట్టింగుల ప్రకారం వాట్సాప్ డార్క్ మోడ్ ఆన్ / ఆఫ్ అవుతుంది.

గత రెండేళ్లుగా వాట్సాప్ లో డార్క్ మోడ్‌ను ప్రవేశపెడుతున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే అది తాజాగా నిజమైంది. వాస్తవానికి డార్క్ మోడ్ ఎలా ఉంటుందో అందరికి అవగాహన ఉన్నప్పటికీ.. దీని అనుభూతిని ఆస్వాదించడం కోసం యూజర్లు తెగ ఆరాటపడుతున్నారు. కాగా ఈ ఏడాది జనవరిలో ఆండ్రాయిడ్ మరియు iOS కోసం పబ్లిక్ బీటాలో డార్క్ మోడ్ రూపొందించబడింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories