సరికొత్త ఫీచర్లతో వాట్సప్..

సరికొత్త ఫీచర్లతో వాట్సప్..
x
Highlights

టెక్నాలజీ పెరిగిపోతుంటే మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఈ ఫోన్లు పెరిగిన నాటి నుంచి ప్రపంచమంతా అరచేతిలోనే కనిపిస్తుంది.

టెక్నాలజీ పెరిగిపోతుంటే మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఈ ఫోన్లు పెరిగిన నాటి నుంచి ప్రపంచమంతా అరచేతిలోనే కనిపిస్తుంది. అంతే కాదు ఏ సమాచారమైనా క్షణాల్లోనే అందరికీ అందుతుంది. ఇలా సమాచారాన్ని ఫేస్ బుక్, వాట్సప్, ఇస్టాగ్రామ్, మెసెంజర్, షేర్ ఛాట్ లాంటి చాలా యాప్స్ అందుబాటులోకి వచ్చాయి.

అయితే వీటన్నింటిలో ఎక్కువగా వాడుకలో ఉన్న యాప్ వాట్సాప్‌. ప్రపంచంలో చాలా మంది ఈ యాప్ ను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు యూజర్లు మరింత సులువుగా దీన్ని ఉపయోగించేందుకు వాట్సాప్‌ సంస్థ అద్భుతమైన సరికొత్త ఫీచర్లను అందివ్వనుంది. కొత్తగా అందించనున్న ఫీచర్లలో డార్క్‌ మోడ్‌, లో డేటా మోడ్‌, మల్టిపుల్‌ డివైస్‌ సపోర్ట్‌ ఇవన్నీ ఉండనున్నాయి. అతి త్వరలోనే ఈ ఫీచర్‌లను వాట్సప్ తన యూజర్ల ముందుకు తీసుకురానుంది.

అంతేకాదు మొబైల్‌ డేటా వాడుతున్నప్పుడు డేటా సేవ్‌ అయ్యే విధంగా లో డేటా మోడ్‌ ఫీచర్‌ను కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నారన్నారు. వీటితో పాటు ఒక వాట్సాప్‌ అకౌంట్‌ను మల్టీ డివైస్‌లలో వాడుకునే విధంగా తయారుచేయనున్నారు. అంతే కాక వాట్సాప్‌ స్టేటస్‌ హైడింగ్‌, క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా కాంటాక్ట్‌ల షేరింగ్‌ ఇతర ఫీచర్లను యూజర్సకోసం ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే అనేక సోషల్ యాప్స్‌లో ఈ ఫీచర్స్ అన్నీ ఉపయోగంలో ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories