Self Departure: సెల్ఫ్‌ డిపార్చర్ అంటే ఏంటి? అమెరికాలో ఈ విధానంపై ఎందుకుంత చర్చ జరుగుతోంది?

What Is Self Departure In America Donald Trump Rule Sparks Debate
x

Self Departure: సెల్ఫ్‌ డిపార్చర్ అంటే ఏంటి? అమెరికాలో ఈ విధానంపై ఎందుకుంత చర్చ జరుగుతోంది?

Highlights

Self Departure: అమెరికాలో తాజా వలస విధానాలు చట్టబద్ధంగా ఉండే వారినీ భయపెడుతున్నాయి. 'సెల్ఫ్ డిపార్చర్' పేరుతో ప్రవేశపెట్టిన కొత్త నియమం, వివరాల నమోదు తప్పనిసరి చేసిన నిర్ణయం వలసదారుల్లో గందరగోళాన్ని పెంచుతున్నాయి. చట్టాలను గౌరవిస్తూ జీవిస్తున్న వారికీ ఈ మార్పులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నది ఆందోళన కలిగించే విషయంగా మారింది.

Self Departure: ఒకప్పుడు ఆశల దేశంగా వెలిగిన అమెరికా ఇప్పుడు వలసదారులకు గందరగోళంగా మారిపోయింది. తరచూ మారుతున్న నిబంధనలు, ఒక్కోరోజూ కొత్త ఆదేశాలు, ఒక్కోసారి కనిపించని 'బాంబులా' పడుతున్న హెచ్చరికలు అక్కడి వలస జీవితం తలకిందులుగా మార్చేస్తున్నాయి. తాజాగా వచ్చిన 'సెల్ఫ్ డిపార్చర్' విధానం మరోసారి వలసదారుల్లో భయాన్ని పెంచింది.

ఈ విధానం ప్రకారం, అమెరికాలోకి వచ్చి 30 రోజులు దాటిన ప్రతీ విదేశీయుడు తన వివరాలను ప్రభుత్వానికి తప్పనిసరిగా నమోదు చేయాలి. ఫింగర్‌ప్రింట్‌లు లేదా ఇతర బయోమెట్రిక్ వివరాలు లేకపోతే గుర్తించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మామూలుగా కనిపించినా, దీని వెనుక నిజమైన ఉద్దేశం ఏమిటంటే.. ఎవరు ఎక్కడ ఉన్నారో ట్రాకింగ్ చేయడం. ఈ నియమాలను పాటించనివారిపై కేవలం జరిమానాలు మాత్రమే కాదు, జైలు శిక్షలు కూడా పడే అవకాశం ఉంది. అలాగే డాక్యుమెంట్లు సరైనవిగా లేకపోతే వాళ్లు స్వయంగా అమెరికా వదిలి వెళ్లిపోవాలని సూచిస్తున్న ప్రభుత్వం, దీన్ని 'సెల్ఫ్ డిపార్చర్' అనే పేరుతో గుర్తిస్తోంది.

ఈ విధానంలో వలసదారు ముందుగా అధికారులను సంప్రదించి తిరుగు ప్రయాణానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలి. టికెట్లు స్వయంగా బుక్ చేసుకుని, ఎలాంటి అరెస్ట్ లేకుండా వెళ్లే అవకాశం పొందవచ్చు. అయితే ఇది పాటించకపోతే.. డిటెన్షన్లు, డిపోర్టేషన్ ఉత్తర్వులు తప్పవు. డిపోర్ట్ అయిన తర్వాత తిరిగి అమెరికాలోకి అడుగుపెట్టేందుకు అవకాశం ఉండకపోవచ్చు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే.. ఈ నియమాలు కేవలం అక్రమంగా ఉన్నవారికే కాక, చట్టబద్ధంగా ఉండే వలసదారులను కూడా గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. ఓ చిన్న డాక్యుమెంట్ తప్పిపోయినా, సమయానికి సమాచారం అప్‌డేట్ కాకపోయినా, చిన్న టెక్నికల్ లోపం జరిగినా వారి జీవితం తలకిందులవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories