Astronauts Food: అంతరిక్షంలో వ్యోమగాములు ఏం తింటారు?

Astronauts Food: అంతరిక్షంలో వ్యోమగాములు ఏం తింటారు?
x
Highlights

Astronauts Food: అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు ఏం తింటారు? అంతరిక్షంలో ప్రత్యేకంగా వంట చేసుకుంటారా? ఫుడ్ ఎంతకాలం నిల్వ ఉంటుంది?

Astronauts Food: అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు ఏం తింటారు? అంతరిక్షంలో ప్రత్యేకంగా వంట చేసుకుంటారా? ఫుడ్ ఎంతకాలం నిల్వ ఉంటుంది? ఫ్రిజ్, ఓవెన్ లాంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయా? భూమి మీద తీసుకునే ఆహారాన్నే తీసుకోవచ్చా? అంతరిక్షంలో వ్యోమగాముల ఆహారం గురించి తెలుసుకుందాం.

అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఫుడ్ ఏడాది వరకు నిల్వ చేసుకోవచ్చు. మనం సాధారణంగా భూమి మీద తీసుకొనే ఫుడ్ కాకుండా అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఫుడ్ ‌ ప్రత్యేకమైంది. అంటే భూమి మీద ఎలాంటి ఆహారాన్నైనా తీసుకోవచ్చు. కానీ, అంతరిక్షంలో ఏది పడితే అది తినలేం. తినకూడదు కూడా. అందుకే అంతరిక్షంలోకి వెళ్లే సమయంలో ఆహారాన్ని ప్రాసెస్ చేస్తారు. ఈ ఫుడ్ లో నీరు లేకుండా జాగ్రత్త తీసుకుంటారు. మూడు పూటలు వ్యోమగాములు ఆహారం తీసుకుంటారు.

నీరు లేని ఫుడ్‌ను అంతరిక్షంలోని 170 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఓవెన్ లో వేడి చేస్తారు. 170 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఫుడ్ వేడి చేయడానికి 20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. వ్యోమగాముల టూర్ ను బట్టి వారికి ఫుడ్ ప్యాక్ చేస్తారు. అయితే ఏదైనా అవాంతరాలు ఏర్పడి అంతరిక్షంలోనే ఉండాల్సి వస్తోందనే కారణంగా ఎక్స్ ట్రా ఫుడ్ ను కూడా వ్యోమగాములతో పంపుతారు. అంటే రోజుకు ఒక్కో వ్యోమగామికి 2వేల అదనపు కేలోరీల ఫుడ్ ఎక్స్ ట్రా పంపుతారు.

అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములను ఆకలి మందగిస్తోంది. మనం రోజు తిన్నట్టే ఫుడ్ తీసుకోరు. కానీ, పోషకాలు అందించే ఫుడ్ మాత్రమే తీసుకుంటారు. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల అభిరుచులకు అనుగుణంగా ఈ ఫుడ్ ను తయారు చేస్తారు. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఇస్తారు. గింజధాన్యాలు ప్రత్యేకంగా నిల్వ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫుడ్‌ను ప్రత్యేకంగా ప్రాసెస్ చేసి ప్యాక్ చేస్తారు. ఈ ఫుడ్ కు నీటిని కలుపుకొని తినాలి.

జాన్ గ్లెన్ అనే వ్యోమగామి ఫస్ట్ టైమ్ అంతరిక్షంలో ఫుడ్ తిన్నారు. నీరు లేకుండా చేసిన ఫుడ్‌ను తీసుకున్నారు. అమెరికాలో సాయుధ దళాలు ఉపయోగించే మీల్స్, రెడీ టూ ఈట్ వంటి ఫుడ్ ను వ్యోమగాములు ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. తమ వ్యోమగాముల కోసం నాసా టెక్సాస్ లోని జాన్సస్ స్పేస్ సెంటర్ లో స్పేస్ ఫుడ్ సిస్టమ్స్ లాబోరేటరీ తయారు చేసిన ఫుడ్ ను అందిస్తారు.

ఎలా తింటారు?

అంతరిక్షంలో వ్యోమగాములు తేలుతుంటారు. వ్యోమగాములకు పంపేఫుడ్ ప్రత్యేక ప్యాకేజింగ్ లేదా డబ్బాల్లో వస్తోంది. ఫుడ్ తీసుకునే సమయంలో ఇది గాల్లో తేలకుండా టేప్, టెథర్, అయస్కాంతాలు ఉపయోగిస్తారు. ప్యాక్ చేసిన ఫుడ్ ను తెరవడానికి ప్రత్యేకమైన కత్తెర, తినడానికి ప్రత్యేకమైన స్పూన్ ఉపయోగిస్తారు. గురుత్వాకర్షణ రుచిని గ్రహించే శక్తిపై ప్రభావం చూపుతుంది. జీరో గ్రావిటీలో పనిచేయడం వల్ల భూమి మీద ఉన్నట్టు కాళ్లు, చేతులు కదపలేం.

ఎలాంటి ఫుడ్ అంతరిక్షంలో నిషేధం

ఉప్పు, చక్కెర వంటి వాటిని అంతరిక్షంలోకి తీసుకెళ్లడం నిషేధం. ఇవి ఘన రూపంలో తీసుకెళ్తే ఇబ్బందులు వస్తాయి. అయితే వీటిని ద్రవ రూపంలో తీసుకెళ్లవచ్చు. బ్రెడ్ ను కూడా అంతరిక్షంలోకి అనుమతించరు. బ్రెడ్ బదులుగా టోర్టిల్లాలను వ్యోమగాములు తింటారు.సోడా, ఐస్ క్రీమ్ కూడా నిషేధమే.

Show Full Article
Print Article
Next Story
More Stories