Donald Trump's high tariffs: ట్రంప్ టారిఫ్‌లతో ఇండియా బేజారు

What are the impacts of Donald Trump high tariffs on India and which sectors will be affected more in india
x

Donald Trump's high tariffs impacts on india : ట్రంప్ టారిఫ్‌లతో ఇండియా బేజారు

Highlights

Donald Trump's tariffs effects on India: విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వరసగా బాంబులు పేలుస్తున్నారు....

Donald Trump's tariffs effects on India: విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వరసగా బాంబులు పేలుస్తున్నారు. ట్రంప్, మోదీల జోడీ చూసి మురిసిపోయిన వారికి ట్రంప్ టారిఫ్ దెబ్బ చూసి మైండ్ బ్లాక్ అవుతోంది. భారత్‌తో ట్రంప్ సాఫ్ట్‌గా ఉంటారన్న అభిప్రాయాలను ట్రంప్ ఒక్క మాటతో ముక్కలు చేశారు. ఇండియాపై ట్రంప్ ప్రకటిస్తున్న టారిఫ్‌లు చూస్తే రెండు దేశాల మధ్య సఖ్యత కొనసాగుతుందా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది.

అంటే, ఇటీవల మోదీ అమెరికా వెళ్లినప్పుడు ఐ మిస్ యూ మై ఫ్రెండ్ అని హత్తుకుని ట్రంప్ చెప్పిన మాటలన్నీ ఉత్తుత్తివేనా? అమెరికా, భారత్ వాణిజ్య సంబంధాలు ఇకపై మరింత సంక్లిష్టంగా మారిపోతాయా? ట్రంప్ టారిఫ్‌లతో భారత్ మీద పడే మొత్తం భారం ఎంత... ఇదే నేటి ట్రెండింగ్ స్టోరీ.

భారత్‌పై భారీగా సుంకం బాదుడు

ఏప్రిల్ 2 నుండి భారత్‌పై కూడా అమెరికా భారీ సుంకం విధించేందుకు సిద్ధమైంది. మరీ ముఖ్యంగా ఆటోమొబైల్ సెక్టార్‌లో భారత్ అమెరికాపై 100 శాతం పన్ను విధిస్తోందని ట్రంప్ అన్నారు. అమెరికా పట్ల భారత్ వైఖరి సరిగ్గా లేదని చెబుతూ ముందు నుండీ భారత్ ఇంతేనని అన్నారు. అందుకే ఏప్రిల్ 2 నుండి అమెరికాపై భారత్ ఎంత ట్యాక్స్ విధిస్తే అమెరికా కూడా అంతే టాక్స్ విధిస్తుందన్నారు.

ఒకవేళ అమెరికా ఉత్పత్తులు ఏవైనా భారత్ మార్కెట్లో లేకుండా అడ్డుకునేందుకు ఏమైనా నాన్-మానిటరీ ట్యాక్సులు విధిస్తే అమెరికా కూడా అదే పని చేస్తుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా కాంగ్రెస్‌లో మంగళవారం ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్ పట్ల ట్రంప్ వైఖరి ఏంటి?

ట్రంప్ అధికారంలోకి వచ్చీ రావడంతోనే మెక్సికో, కెనడా దేశాలపై 25 శాతం సుంకం విధించారు. అమెరికాపై ఎవరు ఎక్కువ సుంకం విధిస్తే వారిపై అంతే ఎక్కువ సుంకం విధిస్తామని ప్రపంచ దేశాలను హెచ్చరించారు. అమెరికాతో యూరప్ దేశాలు వ్యాపార సంబంధాలు భారీగా తగ్గించాయని, అందుకు బదులుగా వారిపై కూడా అధిక సుంకం విధిస్తామని బెదిరించారు.

Tax Free Countries: ఇన్‌కమ్ టాక్స్ లేని దేశాలు | No Income Tax

భారత్, బ్రెజిల్, చైనా లాంటి దేశాలు అమెరికాపై అధిక మొత్తంలో సుంకం విధిస్తున్నాయని అన్నారు. అందుకే ఆయా దేశాలపై అమెరికా వైపు నుండి సేమ్ ట్రీట్మెంట్ ఉంటుందన్నారు. అమెరికాకు హానీ చేస్తోన్న దేశాల గురించి చెబుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఇంకొన్ని గంటల్లోనే మోదీతో సమావేశం ఉందనగా ట్రంప్ ఈ మాటలు అన్నారు.

అమెరికా ఉత్పత్తులపై భారత్ ట్యాక్స్ ఎంత ?

గతేడాది అమెరికా నుండి భారత్ 42 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు దిగుమతి చేసుకుంది. ఇది అమెరికాకు భారత్ ఎగుమతి చేసిన 87.4 బిలియన్ డాలర్ల వాణిజ్యం కంటే 45.7 బిలియన్ డాలర్లు తక్కువ. అందులో చెక్కతో తయారయ్యే ఉత్పత్తులు, యంత్రాలపై కనిష్టంగా 7 శాతం సుంకం విధించింది. చెప్పులు, రవాణా సామాగ్రిపై 15 శాతం నుండి 20 శాతం సుంకం విధించింది. ఆహార ఉత్పత్తులపై గరిష్టంగా 68 శాతం వరకు ట్యాక్స్ విధించింది.

అమెరికా పండించే వ్యవసాయ ఉత్పత్తులపై ఇతర దేశాలు వసూలు చేసే సగటు సుంకం 5 శాతంగా ఉంది. అదే ఉత్పత్తులపై అమెరికా నుండి భారత్ వసూలు చేస్తోన్న సగటు సుంకం 39 శాతంగా ఉందని అమెరికా ఆరోపిస్తోంది. అందుకే అమెరికాపై భారత్ భారీగా సుంకం వసూలు చేస్తోందని ట్రంప్ తరచుగా ఆరోపిస్తూ వస్తున్నారు.

అప్పుడు మోదీని ఆకాశానికెత్తిన ట్రంప్

ఈ హెచ్చరికల మధ్యనే ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ అమెరికాలో డోనల్డ్ ట్రంప్‌ను కలిశారు. మోదీని ట్రంప్ హత్తుకుని వెల్‌కమ్ చెప్పారు. అది మొదలు సెండాఫ్ ఇచ్చే వరకు చాలా స్నేహపూర్వకమైన వాతావరణంలో ఈ భేటీ జరిగింది. భారత్‌తో అసలు తనకు సమస్యే లేదన్నంత ఫ్రెండ్లీగా వ్యవహరించారు.

మోదీని ట్రంప్ రిసీవ్ చేసుకున్న తీరు చూసి గ్లోబల్ మీడియానే ఆశ్చర్యపోయింది. అంతేకాదు.. ట్రంప్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో మోదీకి తెలిసినంత బాగా ఇంకే దేశాధినేతకు తెలియదనే కామెంట్స్ కూడా వినిపించాయి.

అమెరికాతో మోదీ కీలక ఒప్పందాలు

కెనడా, మెక్సికో, యూరప్, బ్రెజిల్, చైనాతో పాటు భారత్ వంటి దేశాలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన తరువాత జరిగిన భేటీ ఇది. ఈ భేటీలో మోదీ అమెరికాతో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. వచ్చే ఐదేళ్లలో అమెరికాతో 500 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం చేసే ఒప్పందాలపై భారత్ సంతకం చేసింది.

భారత్ అమెరికాకు 87.4 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేస్తోంది. కానీ అమెరికా నుండి మాత్రం ఆ స్థాయిలో దిగుమతులు చేసుకోవడం లేదు. అమెరికా నుండి భారత్ చేసుకుంటున్న ఇంపోర్ట్స్‌లో 45.7 బిలియన్ డాలర్ల లోటు ఉన్నట్లు ట్రంప్ గుర్తించారు. అందుకే ఆ వెలితిని నింపేలా అమెరికాతో ఆయిల్, గ్యాస్, ఎనర్జీ కొనుగోలు విషయంలో భారత్ మరో ఒప్పందం చేసుకుంది.

అమెరికా నుండి భారత్ గతేడాది 15 బిలియన్ డాలర్ల ఎనర్జీ కొనుగోలు చేసింది. ఆయిల్, న్యాచురల్ గ్యాస్ రెండూ కలిపి ఇకపై ఆ మొత్తాన్ని 25 బిలియన్ డాలర్లకు పెంచుతూ భారత్ తాజాగా ఒప్పందం చేసుకుంది.

ట్రంప్‌ను కలవడానికంటే ముందే ఈ ఏడాది బడ్జెట్‌‌లో మోదీ సర్కారు విదేశీ బైకులపై ఉన్న టారిఫ్స్‌ను తగ్గించింది. 1600 CC వరకు సామర్థ్యం ఉన్న బైకులపై ఉన్న 50 శాతం సుంకాన్ని 40 శాతానికి తగ్గించింది. అలాగే 1600 CC కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకులపై 50 శాతం ఉన్న సుంకాన్ని 30 శాతానికి తగ్గించింది.

అమెరికాకు చెందిన హార్లే డేవిడ్సన్ బైకులకు భారత్‌లో భారీ డిమాండ్ ఉంది. అందుకే ఒకరకంగా ట్రంప్‌ను కూల్ చేయడం కోసమే భారత్ ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అమెరికా పంపిస్తోన్న అక్రమ వలసదారులను కొర్రీలు పెట్టకుండా రిసీవ్ చేసుకోవడంలోనూ మోదీ దౌత్యాన్నే చూపించారు కానీ ఒక్క కంప్లయింట్ కూడా చేయలేదు.

అయితే, అమెరికాతో ట్రేడ్ వార్‌ లేకుండా చూసుకోవడం కోసం భారత్ ఇంత చేసినప్పటికీ ట్రంప్ తీరు మాత్రం మారలేదు. మోదీతో సమావేశానికి ముందు భారత్ గురించి ఎలాగైతే మాట్లాడారో... మంగళవారం నాటి ప్రసంగంలో కూడా అదే వైఖరి చూపించారు.

ట్రంప్ నిర్ణయంతో నష్టపోయే రంగాలు

డోనల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇండియాలో కెమికల్స్, స్టీల్, అల్యూమినియం, జువెలరీ, ఆటోమొబైల్స్, ఫార్మసుటికల్స్, వ్యవసాయం, ఆహార ఉత్పత్తి రంగాలపై తీవ్ర ప్రభావం చూపించనుంది. సంవత్సరానికి 7 బిలియన్ డాలర్ల నష్టం ఉంటుందని సిటీ రిసెర్చ్ అనలిస్ట్స్ అనే రిసెర్చ్ ఫమ్ అంచనా వేస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 61 వేల కోట్ల నష్టం అన్నమాట.

అమెరికాతో యుద్ధానికి సిద్ధం -చైనా

భారత్, బ్రెజిల్, చైనాలపై ఏప్రిల్ 2 నుండి ఎక్కువ టారిఫ్స్ ప్రకటించిన నేపథ్యంలో చైనా స్పందించింది. ఒకవేళ అమెరికాకు నిజంగానే ఫెంటానిల్ సమస్య అని అనుకుంటే చైనాతో నేరుగా మాట్లాడాలి. కానీ ఇలా భారీగా సుంకం పెంచి ట్రేడ్ వార్‌కు తెరతీయాలని అనుకుంటే అందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటించింది. అది ట్రేడ్ వార్ అయినా... మరో వార్ అయినా... చైనా వెనక్కు తగ్గేదేలే అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కౌంటర్ ఇచ్చింది.

చైనాతో అమెరికాకు ఉన్న ఫెంటానిల్ సమస్య ఏంటి?

అమెరికాలో ఫెంటానిల్ అనే డ్రగ్ అక్కడి యువతను నాశనం చేస్తోంది. అది చైనాలో తయారై మెక్సికో మీదుగా అమెరికాలోకి వస్తోందనేది అమెరికా పాలకులు మొదటి నుండి చేస్తోన్న ఆరోపణ. అయితే, వాస్తవానికి అమెరికా పట్ల చైనా మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ ఫెంటానిల్ ను అరికట్టేందుకు గట్టిగా కృషి చేస్తున్నట్లు చైనా చెబుతోంది. అమెరికా కోసం తాము ఇంత చేస్తున్నప్పటికీ ట్రంప్ మాత్రం తమపై సుంకం పెంచుతూ శిక్ష విధిస్తున్నారని చైనా అంటోంది. అమెరికాకు మేం మంచి చేసినప్పటికీ... ట్రంప్ మాత్రం మాకు చెడే చేస్తున్నారని.. అందుకే ఇక వార్ ఏదైనా మేం సిద్ధమేనని చైనా స్పష్టంచేసింది.

ట్రంప్ ప్రకటనపై కెనడా కూడా ఘాటుగానే స్పందించింది. మెక్సికో కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఇప్పుడు ఇండియా ఎలా రియాక్ట్ అవుతుందనేదే సర్వత్రా ఉత్రంఠ నెలకొని ఉంది.

Income Tax Free Countries: ఇన్‌కమ్ టాక్స్ లేని దేశాలు

Donald Trump Vs Zelensky: అమెరికా అధ్యక్షుడితో జెలెన్‌స్కీ ఎందుకు గొడవపడ్డారు? ఈ గొడవ తరువాత ఉక్రెయిన్ ముందున్న ఆప్షన్స్ ఏంటి?

Countries with More Women Than Men: ఈ దేశాల్లో మగాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువ

Show Full Article
Print Article
Next Story
More Stories