America: మాస్కుల విషయంలో నిర్లక్ష్యం వద్దంటోన్న నిపుణులు

Wearing Mask Could Save At least 14000 Lives Says America University of Washington Institute for Health Metrics
x

యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్ (ఫైల్ ఇమేజ్)

Highlights

America: మాస్కుల ఫలితాలపై రిపోర్టు రూపొందించిన యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌

America: మాస్కు వచ్చే కరోనాను ఆపుతుందా..? నేనొక్కడిని పెట్టుకోకుంటే ఏం..? అంటూ ఎంతోమంది ఓ విషయాన్ని విస్మరిస్తూ వస్తున్నారు. పక్కా టీకా వచ్చే వరకు మాస్కులే మనకు రక్ష అనే సంగతి మరిచిపోతున్నారు. అయితే వైరస్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్‌లు సమర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ.. మాస్కులు ధరిస్తేనే మనకూ.. మనతోటి వారికి మంచిదంటున్నాయి విశ్లేషణలు. టీకా తీసుకున్నంత మాత్రాన మాస్కుల విషయంలో నిర్లక్ష్యం తగదని హెచ్చరిస్తున్నారు.

వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మాస్కు ధరించడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేయడంలో మాస్కులు ధరించడమే అత్యంత కీలకమని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్నారు. మాస్కులతో కొవిడ్‌ మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని స్పష్టం చేస్తున్నారు.

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌, ఎవాల్యుయేషన్‌ ఓ అంచనా వేసింది. ఈ అంచనా రిపోర్టు ప్రకారం, 2021 ఆగస్టు నాటికి అమెరికాలో మరణాల సంఖ్య 6 లక్షల 18 వేల 523కు చేరుకోవచ్చని తెలిపింది. ఒకవేళ అమెరికాలో 95శాతం జనాభా మాస్కు ధరిస్తే మాత్రం ఇందులో కనీసం 14వేల మంది ప్రాణాలను కాపాడుకోవచ్చని అంచనా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories