Donald Trump: గాజానూ వదలని ట్రంప్.. ప్రెసిడెంట్ సంచలన ప్రకటన

Donald Trump: గాజానూ వదలని ట్రంప్.. ప్రెసిడెంట్ సంచలన ప్రకటన
x
Highlights

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రధాని...

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో భేటీ తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ గాజా యుద్ధం తాజా పరిస్థితిపై నెతన్యాహూతో ట్రంప్ చర్చలు జరిపారు.

గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని..అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివ్రుద్ధి చేస్తే అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు, ఇళ్లు కల్పించవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటన చరిత్రను మారుస్తుందని నెతన్యాహూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

గాజాలో ఉద్రిక్తతల కారణంగా నిరాశ్రుయులగా మారిన పాలస్తీనీయులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ఈమధ్యే ట్రంప్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనను ఆయా దేశాలు ఖండించాయి. అలా చేస్తే తమ ప్రాంతంలోని స్థిరత్వం దెబ్బతింటుందని ఈజిప్టు, జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, పాలస్తీనా అథారిటగీ, అరబ్ లీగ్స్ సంయుక్తంగా ప్రకటించాయి. ఈ క్రమంలోనే గాజాను స్వాధీనం చేసుకుని డెవలప్ చేస్తామని ట్రంప్ ప్రకటించడం గమనార్హం.

గాజాగాను స్వాధీనం చేసుకుంటానంటూ ట్రంప్ ప్రకటించడాన్ని హమాస్ తీవ్రంగా ఖండించింది. ఆయన గందరగోళం రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారని మిలిటెంట్ సంస్థకు చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో గందరగోళం, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ట్రంప్ ఈ ప్రకటన చేశారు. మా ప్రజలు దీన్ని ఒప్పుకోరు. వారి భూమి నుంచి వారిని తరలించడమే కాకుండా ఈ దురాక్రమణను అడ్డుకోవాల్సి అని సమీఅబు జుహ్రీ ఓ ప్రకటనలో తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories