అప్పుడు నేనూ వైరస్ భారిన పడ్డాను : పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాండాద్

అప్పుడు నేనూ వైరస్ భారిన పడ్డాను : పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాండాద్
x
Javed Miandad
Highlights

ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మందికి సోకిన కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచంలోని చాలా ప్రధాన నగరాలు లాక్డౌన్లో ఉన్నాయి, ఈ సమయంలో పాకిస్తాన్ మాజీ బ్యాట్స్ మాన్ జావేద్ మియాండాద్ ఆసక్తికర విషయాన్నీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మందికి సోకిన కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచంలోని చాలా ప్రధాన నగరాలు లాక్డౌన్లో ఉన్నాయి, ఈ సమయంలో పాకిస్తాన్ మాజీ బ్యాట్స్ మాన్ జావేద్ మియాండాద్ ఆసక్తికర విషయాన్నీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకున్నారు. 1992 లో ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ సమయంలో తాను ఒక విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్నానని వెల్లడించారు.

పాకిస్తాన్ తొలి ప్రపంచ కప్ సాధించిన 18 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ఆయన తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. 1992 లో ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో తనకు వైరస్ సోకిందని, ఇది చెమట పట్టేలా చేసిందని.. చివరకు బ్యాటింగ్ చేసేటప్పుడు తన శక్తిని కూడా పోగొట్టుకునేలా చేసిందని అన్నారు.

"నేను ఆ ఫైనల్ మ్యాచ్ యొక్క వీడియో క్లిప్పింగ్లను తిరిగి చూసినప్పుడు, మేము ఆ ప్రపంచ కప్ను ఎలా గెలుచుకున్నామో నాకు ఇంకా అర్థం కాలేదు. మేము బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, ప్రారంభంలో

త్వరగా వికెట్లు కోల్పోతున్నాము, నా ఏకైక లక్ష్యం క్రీజులో నిలబడి నా వికెట్ కోల్పోకుండా ఉండటమే.

ఆ సమయంలో నేను చాలా అసౌకర్యంలో ఉన్నాను. ఎందుకంటే అప్పటికే నేను వైరస్ సంక్రమణతో బాధపడుతున్నాను.. ఈ వైరస్ కారణంగా నేను కనీసం పరుగెత్తలేకపోయాను, మీరు సరిగ్గా గుర్తుంచుకుంటే, నేను ఇన్నింగ్స్ చివరిలో నా షాట్లను కూడా ఆడలేదు అని మియాండాద్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నారు. వైద్యులను సంప్రదించేత వరకూ కూడా తనకు వైరస్ గురించి తనకు తెలియదని అన్నారు.

కాగా ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ 24 పరుగులకె కీలక వికెట్లను చేజార్చుకుంది. ఆ సమయంలో మియాందాద్, ఇమ్రాన్ ఖాన్ 139 పరుగుల భాగస్వామ్యం అందించారు. అప్పుడు కెప్టెన్ గా ఇమ్రాన్ ఖాన్ 110 బంతుల్లో 72 పరుగులు చేయగా, మియాండాద్ 98 బంతుల్లో 58 పరుగులు చేశారు. ఇన్జామామ్-ఉల్-హక్ (46 బంతులకు 42 పరుగులు చేశారు. తరువాత వసీం అక్రమ్ 18 బంతులకు 33 పరుగులు చేశారు. దీంతో ఇంగ్లాండ్ పై ఆరు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.

ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ 49.2 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌట్ అయింది. వసీం అక్రమ్, లెగ్ స్పిన్నర్ ముష్తాక్ అహ్మద్ ఒక్కొక్కరు మూడు వికెట్లు పడగొట్టారు. ఇక పాకిస్తాన్ తరఫున 124 టెస్టుల్లో 8832 పరుగులు చేసిన మియాండాద్ 233 వన్డేల్లో 7381 పరుగులు చేశారు. 1992 ప్రపంచ కప్‌లో నాకౌట్ దశకు అర్హత సాధించడం ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని జట్టుకు చాలా అదృష్టమని ఆయన అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories