పుతిన్‌కు క్యాన్సర్‌.. సర్జరీకి వెళ్తే ఆయనకు అధికార బాధ్యతలు...

Vladimir Putin Undergo Surgery for Cancer will Hand Over Power to His Secretary Nikolai Patrushev | Live News
x

ఫైల్ ఫోటో

Highlights

Vladimir Putin: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు వ్లాదిమిర్‌ పుతిన్‌...

Vladimir Putin: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు వ్లాదిమిర్‌ పుతిన్‌.. ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టిన తరువాత ఆయన గురించి ఎన్నో కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా ఆయన ఆరోగ్యంపైనా అంతర్జాతీయంగా విశ్లేషణలు జోరుగా ప్రచారమవుతున్నాయి. తాజాగా పుతిన్‌ క్యాన్సర్‌ చికిత్స చేయించుకుంటున్నారంటూ అమెరికాకు చెందిన న్యూయార్క్‌ పోస్ట్‌ మరోసారి కథనాన్ని ప్రచురించింది. పుతిన్‌ చికిత్స కోసం వెళ్తే.. అధికార బాధ్యతలను తను నమ్మిన బంటు నికోలయ్ పట్రుచేవ్‌కు అప్పగిస్తున్నారంటూ న్యూయార్క్‌పోస్టు రాసుకొచ్చింది. దీనిపై రష్యా నుంచి మాత్రం ఎలాంటి స్పందనా రాలేదు.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో జెలెన్‌స్కీ, వ్లాదిమిర్‌ పుతిన్‌ అనే పేర్లు.. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ మార్మోగుతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దూకుడుతో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమోనని పలు దేశాలు భయపడుతున్నాయి. యుద్ధంతో పుతిన్‌పై ఎన్నో కథనాలు అంతర్జాతీయ మీడియాలో వెలువుడుతున్నాయి. అయితే వాటిలో పుతిన్‌ వ్యక్తిగత, ఆరోగ్యంపైనే అత్యధిక విశ్లేషణలు వెలువడ్డాయి. తాజాగా ఆనారోగ్యంగా ఉడడం.. బహిరంగ ప్రదేశాల్లో ప్రవర్తన తీరు ఆధారంగా పుతిన్‌ ఆరోగ్యంపై న్యూయార్క్‌ పోస్టు ఓ కథనాన్ని ప్రచురించింది. పుతిన్‌ క్యాన్సర్‌తో పాటు పార్కిన్‌సన్‌, ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్టు తెలిపింది.

పుతిన్‌ తప్పనిసరిగా క్యాన్సర్‌ ఆపరేషన్‌ చేయించుకోవాలని వైద్యులు చెప్పినట్టు రష్యా విదేశీ నిఘా విభాగం మాజీ అధికారి నిర్వహిస్తున్న టెలిగ్రామ్‌ చానల్‌లో వచ్చిన కథనాన్ని న్యూయార్క్‌ పోస్టు ఉదహరించింది. అయితే పుతిన్ ఆరోగ్యంపై తమకు ఎలాంటి సమాచారం లేదని.. ఆయా కథనాలను ద్రువీకరించే ఆధారాలు ఏవీ లేవని అమెరికా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల పుతిన్‌.. తన నమ్మిన బంటు నికోలై పట్రుచేవ్‌తో రెండు గంటల పాటు భేటీ అయ్యారంటూ టెలిగ్రామ్‌లో వచ్చిన వార్తను న్యూయార్క్‌ పోస్ట్ గుర్తుచేసింది. తన ప్రభుత్వంలోని అధికారుల్లో పట్రుచేవ్‌ మాత్రమే అత్యంత విశ్వాస పాత్రుడిగా పుతిన్‌ నమ్ముతున్నట్టుగా తెలుస్తోంది.

ఒకవేళ పుతిన్‌ ఆరోగ్య పరిస్థితి విషమిస్తే.. తాత్కాలికంగా అధికార పగ్గాలు పట్రుచేవ్‌కే అప్పగించే అవకాశాలు ఉన్నాయని న్యూయార్క్‌ పోస్టు తన కథనంలో వెల్లడించింది. అయితే పట్రుచేవ్‌ పుతిన్ అంత మంచి వాడు కాదని.. పుతిన్‌ ఆరోగ్యంపై కథనాన్ని రాసిన టెలిగ్రామ్‌ చానల్‌ నివేదించింది. పట్రుచేవ్‌ మోసపూరిత వ్యక్తి అని.. అతడు అధికారంలోకి వస్తే.. రష్యన్లకు సమస్యలు మరింతగా పెరుగుతాయన్నది. పుతిన్‌ ఎక్కువ కాలం అధికారాన్ని అప్పగించడానికి అంగీకరించే అవకాశం లేదని.. రెండు, మూడు రోజుల కంటే ఎక్కువ పట్రుచేవ్‌కు అధికార పగ్గాలు అప్పగించొచ్చని టెలిగ్రామ్ చానల్‌ కథనాన్ని న్యూయార్క్‌ పోస్టు తెలిపింది.

రష్యా భద్రతా మండలి కార్యదర్శి పట్రుచేవ్‌.. నేరుగా పుతిన్‌తో మాట్లాడగలిగిన వ్యక్తి. రష్యాలోని సైనిక, భద్రత సమస్యలపై నేరుగా ఆయన ఆదేశాలను ఇవ్వగలరు. కౌన్సిల్‌ అధికారంలోనూ పట్రుచేవ్‌కు మంచి పట్టు ఉంది. పుతిన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడిగా.. మంచి స్నేహితుడిగా పట్రుచేవ్‌కు పేరుంది. అంతేకాకుండా పుతిన్‌లాగానే.. పట్రుచేవ్‌కూడా రష్యన్‌ ఇంటిటెలిజెంట్‌గా పని చేశారు. మొదట సోవియట్‌ యూనియన్‌లోని కేజీబీతో, రష్యన్‌ ఎఫ్‌ఎస్‌బీలోనూ పని చేశారు.

పుతిన్‌లాగే పాత సోవియట్‌ సామాజ్ర విస్తరణ కాంక్ష పట్రుచేవ్‌లోనూ ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల రష్యన్‌ మీడియా రోసిస్కాయా గెజిటాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అమెరికా, ఐరోపా, ఉక్రెయిన్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. నాజీ భావజాలానికి ఆ దేశాలు మద్దతు ఇస్తున్నాయని పట్రుచేవ్‌ విమర్శలు గుప్పించారు. నాజీ భావజాలన్ని అంతమొందించడమే తమ లక్ష్యమని పట్రుచేవ్‌ తెలిపిన విషయాన్ని కూడా న్యూయార్క్‌ పోస్టు వివరించింది.

ఇదిలా ఉంటే.. రష్యా అధ్యక్షుడు అనారోగ్యం బారిన పడితే.. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం అధికార బాధ్యతలను తాత్కాలికంగా ప్రధానికి అప్పగించాలి. ప్రధాని మిఖైల్‌ మిషుస్తిన్‌కు దేశ నిఘా, రక్షణ వ్యవస్థలపై పట్టులేదు. ఉక్రెయిన్‌ యుద్ధం కీలక దశకు చేరిన నేపథ్యంలో దూకుడుగా వ్యవహరించేవారు కావాలనే ఉద్దేశంతో పట్రుచేవ్‌ వైపు పుతిన్‌ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. పుతిన్‌ ఉదర సంబంధ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు మీడియా కథనాలు వెలువడ్డాయి.

గతంలో చికిత్స కోసం పలుమార్లు పుతిన్‌ రోజుల తరబడి మాయమైనా.. రష్యా మీడియా దాన్ని రహస్యంగా ఉంచింది. అయితే ఇప్పటికే పుతిన్‌ సర్జరీ చేయించుకున్నారని కూడా ప్రచారమవుతోంది. అయితే పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న కథనాలపై క్రెమ్లిన్‌ వర్గాలు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.

కేన్సర్, పార్కిన్సన్స్, స్కిజోఫ్రేనియా వ్యాధులకు హెవీ డోస్‌ మందులు తీసుకోవడంతో పుతిన్‌ బాగా బలహీనపడ్డారని వార్తలు వస్తున్నాయి. తక్షణం కేన్సర్‌ సర్జరీ చేయించుకోవాలని ఆయనకు చికిత్స చేస్తున్న వ్యక్తిగత వైద్యులు సలహా ఇచ్చారు. తాజా వీడియోల్లో పుతిన్‌ ముఖంలో అనూహ్యమైన మార్పులు కనిపించాయి. కూర్చునే, నడిచే తీరులోనూ తేడాలు కనిపిస్తున్నాయి. అతిథులతో కరచాలనం సందర్భంగా చేతులు వణుకుతున్న వీడియోలు వైరలయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories