Vivek Ramaswamy: వివేక్‌ రామస్వామి సమ్‌థింగ్‌ స్పెషల్‌: డొనాల్డ్‌ ట్రంప్‌

Vivek Ramaswamy
x

Vivek Ramaswamy: వివేక్‌ రామస్వామి సమ్‌థింగ్‌ స్పెషల్‌: డొనాల్డ్‌ ట్రంప్‌

Highlights

Vivek Ramaswamy: భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనను “ప్రత్యేకమైన వ్యక్తి” (Something Special)గా పేర్కొంటూ ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ వేదికలో ఒక పోస్ట్‌ చేశారు.

Vivek Ramaswamy: భారతీయ మూలాలున్న అమెరికన్‌ వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) ఒహాయో గవర్నర్‌ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) వివేక్‌కు మద్దతు ప్రకటిస్తూ ప్రశంసల జల్లు కురిపించారు.

ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ (Truth Social) వేదికలో పోస్ట్‌ చేస్తూ, “వివేక్‌ రామస్వామి సమ్‌థింగ్‌ స్పెషల్‌ (Something Special). ఒహాయో రాష్ట్ర గవర్నర్‌ పదవికి ఆయన పోటీ చేస్తున్నారు. నాకు ఆ రాష్ట్రం అంటే ఎంతో ఇష్టం. 2016, 2020, 2024 ఎన్నికల్లో అక్కడ నేను భారీ విజయం సాధించాను. వివేక్‌ నన్ను బాగా తెలుసు. అధ్యక్ష ఎన్నికల్లో నాతోనే పోటీకి వచ్చాడు. అతడు యువకుడు, తెలివైనవాడు, మంచి వ్యక్తి. దేశానికి అతనికి అపారమైన ప్రేమ ఉంది” అని పేర్కొన్నారు.

అదే విధంగా, ఒహాయో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం వివేక్‌ రామస్వామి కీలక పాత్ర పోషిస్తారని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. “సరిహద్దులను రక్షించడం, వలస నేరాలను అరికట్టడం, శాంతిభద్రతలను కాపాడటం, ఎన్నికల సమగ్రతను బలోపేతం చేయడంలో ఆయన నిరంతరం కృషి చేస్తారు” అని ఆయన అన్నారు.

వివేక్‌ రామస్వామి నేపథ్యం:

ఒహాయోలో జన్మించిన వివేక్‌ రామస్వామి తల్లిదండ్రులు కేరళకు చెందినవారు. ఆయన హార్వర్డ్‌ యూనివర్సిటీలో బయోలజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ట్రంప్‌తో పాటు రేసులో ఉన్న వివేక్‌ తరువాత పోటీ నుంచి తప్పుకున్నారు. అనంతరం ట్రంప్‌ విజయానికి తన మద్దతు ప్రకటించి, ఆయన ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories