ఒహాయో గవర్నర్ పదవికి పోటీ: ఎవరీ వివేక్ రామస్వామి?

Vivek Ramaswamy joins ohio governor race
x

ఒహాయో గవర్నర్ పదవికి పోటీ: ఎవరీ వివేక్ రామస్వామి?

Highlights

భారత సంతతికి చెందిన అమెరికన్ వివేక్ రామస్వామి ఒహాయో గవర్నర్ పదవికి పోటీ చేస్తున్నారు.

భారత సంతతికి చెందిన అమెరికన్ వివేక్ రామస్వామి ఒహాయో గవర్నర్ పదవికి పోటీ చేస్తున్నారు. ఆయనకు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, డోజ్ సారథి ఎలాన్ మస్క్ మద్దతుగా నిలిచారు. రామస్వామి తనకు బాగా తెలుసునని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. తనకు ప్రత్యర్దిగా కూడా ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రామస్వామిలో ఏదో ప్రత్యేక ఉందని సోషల్ మీడియాలో ట్రంప్ పోస్టు పెట్టారు.

డోజ్ నుంచి వైదొలగిన వివేక్ రామస్వామి

డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ డీఓజీఈ ...డోజ్ ఏర్పాటులో వివేక్ రామస్వామిది కీలకపాత్ర. డోజ్ కు ఎలాన్ మస్క్ నాయకత్వం వహిస్తారని... ఈ టీమ్ లో వివేక్ రామస్వామి కూడా ఉంటారని ట్రంప్ ప్రకటించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందు ట్రంప్ సోషల్ మీడియాలో ఈ పోస్టు పెట్టారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత డోజ్ నుంచి తప్పుకుంటున్నట్టు వివేక్ రామస్వామి ప్రకటించారు. ఒహియో గవర్నర్ పదవికి వివేక్ రామస్వామి పోటీ చేయాలనే ఆలోచనతోనే డోజ్ నుంచి తప్పుకున్నారు. ఒహియో లెఫ్టినెంట్ గవర్నర్ జోన్ హుస్సేడ్ యూఎస్ సెనెట్ కు ఎంపిక చేశారు. ఖాళీగా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రామస్వామి పోటీ చేస్తున్నారు.

ఎవరీ వివేక్ రామస్వామి?

ఇండియాలోని కేరళ నుంచి అమెరికాకు వెళ్లిన భారత సంతతి దంపతుల కొడుకే వివేక్ రామస్వామి. 1985 ఆగస్టు 9న ఒహియోలోని సిన్సినాటిలో వివేక్ రామస్వామి జన్మించారు.ఆయన తండ్రి వి. గణపతి రామస్వామి, తల్లి గీత రామస్వామి. గణపతి రామస్వామి కేరళలోని కాలికట్ నేషనల్ ఇనిస్టిట్యూట్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఇంజనీర్ గా పనిచేశారు. గీత రామస్వామి అమెరికాలో సైక్రియాటిస్ట్ గా పనిచేశారు. వివేక్ రామస్వామి హార్వర్డ్, యేల్ యూనివర్శిటీల్లో చదువుకున్నారు.

బయో టెక్నాలజీలో కోట్లు సంపాదించారు. woke, Inc. అనే పుస్తకాన్ని రాశారు. ఈ బుక్ అత్యధికంగా అమ్ముడుపోయింది.కార్పోరేట్ యాక్టివిజానికి వ్యతిరేకంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. 2024లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసి చివరి నిమిషంలో ఆయన వెనక్కు తగ్గారు. ట్రంప్ నకు ఆయన మద్దతు ప్రకటించారు.

రోవాంట్ సైన్సెస్ పేరుతో వివేక్ రామస్వామి బయోటెక్ కంపెనీని ప్రారంభించారు. దీని విలువ 59,068 కోట్లు. ఒహయో స్టేట్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న అపూర్వను ఆయన పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు

హెచ్1 బీ వీసాలపై వివేక్ రామస్వామి సంచలన కామెంట్స్

అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న సమయంలో హెచ్ 1 బీ వీసా పద్దతిని రద్దు చేస్తామని అప్పట్లో ప్రకటించారు. మెరిట్ ద్వారా ఈ వీసాలు జారీ చేసే పద్దతిని తెస్తానని ఆయన చెప్పారు. ఉన్నత విద్యలో రిజర్వేషన్ ఉండకూడదని కూడా ఆయన చెబుతుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories