కొవిడ్-19 : కంటతడి పెట్టిస్తోన్న తల్లీకూతుళ్ల సంభాషణ

కొవిడ్-19 : కంటతడి పెట్టిస్తోన్న తల్లీకూతుళ్ల సంభాషణ
x
Highlights

కొవిడ్-19 వలన చైనాలో ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.. ఈ వైరస్ సోకిన వారి తోపాటు వైద్యులు, నర్సులు కూడా మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంటికి దూరమై.....

కొవిడ్-19 వలన చైనాలో ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.. ఈ వైరస్ సోకిన వారి తోపాటు వైద్యులు, నర్సులు కూడా మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంటికి దూరమై.. వృత్తే దైవంగా భావించి కొవిడ్-19 రోగులకు సేవ చేస్తున్నారు పలువురు వైద్య సిబ్బంది. ఈ క్రమంలో కుటుంబసభ్యులకు దూరమై భాధలు పడుతున్నారు.. కొవిడ్-19 కారణంగా తల్లి ప్రేమకు నోచుకోని కూతురి వీడియో అందరిని కంటతడి పెట్టిస్తోంది. కొవిడ్-19 కారణంగా చైనాలో విద్య సిబ్బందికి కుటుంబసభ్యులను కలిసే అవకాశం లేదు.

ఎక్కడ ఈ వైరస్ వారికి సోకుతుందేమోనన్న అనుమానంతో చైనా ప్రభుత్వం వైద్య సిబ్బందికి సంబంధించిన కుటుంబసభ్యులకు తమ వారిని కలవకుండా ఆంక్షలు విధించింది. దాంతో నెలరోజులకు పైగా రోగులకు చికిత్స చేస్తున్న ఒక నర్సు తన కుమార్తెకు 'ఎయిర్ హగ్' ఇస్తున్నట్లు ఒక అధికారిక వార్తా సంస్థ పంచుకున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చైనా హెనాన్ ప్రావిన్స్‌ ఫుగౌ కౌంటీ పీపుల్స్ ఆస్పత్రిలో లియు హైయాన్ నర్సుగా పనిచేస్తుంది.

వీడియోలో, తొమ్మిదేళ్ల వయసున్న కూతురు 'చెంగ్' మాస్కు ధరించి, కన్నీళ్లతో తన తల్లి తన నుంచి తప్పిపోయినట్లు చెబుతుంది. అప్పుడు ఆమె తల్లి కూతురికి గాలిలోనే కౌగిలిని ఇస్తుంది. దాంతో కూతురు కూడా తన తల్లికి కౌగిలిని ఇస్తుంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అమ్మా ఇంటికి ఎప్పుడు వస్తావని కూతురు అడగగా.. నేను వైరస్ తగ్గిన తరువాతే వస్తానని చెబుతుంది.

తొందరగా రా అమ్మా అంటూ కూతురు ఏడుస్తూ తల్లికి చెబుతుంది. దానికి నీ తల్లి "రాక్షసులతో పోరాడుతోంది" త్వరలోనే వస్తుంది అని చెబుతోంది. ఆ తరువాత చెంగ్ తన తల్లి కోసం ఇంటి నుంచి తెచ్చిన క్యారియర్(ఆహార పదార్ధాల పెట్టె)ను నేలమీద పెట్టి ఐ మిస్ యూ మమ్మీ అంటూ కన్నీటితో ఇంటికి తిరిగి పయనమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories