US flight catches fire: గాల్లో ఉండగానే ఇంజిన్‌లో మంటలు.. ప్రమాదంలో అమెరికా విమానం.. వీడియో వైరల్

US flight catches fire
x

US flight catches fire: గాల్లో ఉండగానే ఇంజిన్‌లో మంటలు.. ప్రమాదంలో అమెరికా విమానం.. వీడియో వైరల్

Highlights

US flight catches fire: టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఎడమ వైపు ఇంజిన్ నుంచి మంటలు వస్తుండటాన్ని గుర్తించిన పైలెట్లు అప్రమత్తమై విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు సిద్ధం చేశారు.

US flight catches fire: అమెరికాలో ఓ ప్రయాణికుల విమానం గాల్లో ఉండగానే ఇంజిన్‌లో మంటలు చెలరేగిన దృశ్యం భయాందోళన కలిగించింది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 767-400 విమానం లాస్ ఏంజెల్స్ నుంచి అట్లాంటా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఎడమ వైపు ఇంజిన్ నుంచి మంటలు వస్తుండటాన్ని గుర్తించిన పైలెట్లు అప్రమత్తమై విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు సిద్ధం చేశారు.

వెంటనే లాస్ ఏంజెల్స్ ఎయిర్‌పోర్ట్‌కు తిరిగి మళ్లించిన విమానం అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానాశ్రయంలో ఇప్పటికే అప్రమత్తంగా ఉన్న అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనకు సంబంధించి ప్రయాణికులెవరూ గాయపడినట్టు సమాచారం లేదు.

ఈ ప్రమాదానికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. గాల్లో మంటలు చెలరేగుతున్న దృశ్యాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తు ప్రారంభించింది. గత ఏప్రిల్‌లోనూ డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన మరో విమానం ఇలాంటి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.



Show Full Article
Print Article
Next Story
More Stories