Venezuela political crisis: మదురో అరెస్టుతో వెనిజులాలో అధికార మార్పు.. తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్..!!

Venezuela political crisis: మదురో అరెస్టుతో వెనిజులాలో అధికార మార్పు.. తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్..!!
x
Highlights

Venezuela political crisis: మదురో అరెస్టుతో వెనిజులాలో అధికార మార్పు.. తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్..!!

Venezuela political crisis: వెనిజులా రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేసిన నేపథ్యంలో, ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలిగా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టాలని వెనిజులా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో పాలనా వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

మదురో అరెస్టుతో వెనిజులాలో రాజకీయ అస్థిరత నెలకొనే ప్రమాదం ఉందని భావించిన సుప్రీంకోర్టు, రాజ్యాంగంలోని అత్యవసర నిబంధనలను అమలు చేసింది. తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు స్వీకరించడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగం, రక్షణ వ్యవస్థ, భద్రతా విభాగాలు సజావుగా కొనసాగుతాయని కోర్టు అభిప్రాయపడింది. దేశంలో శాంతి భద్రతలు భంగం కాకుండా చర్యలు తీసుకోవాలని సైన్యం, పోలీసు విభాగాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది.

ఇక మదురోపై అమెరికా నార్కో టెర్రరిజం ఆరోపణల కింద కేసులు నమోదు చేసింది. డ్రగ్స్ అక్రమ రవాణా, ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చారనే ఆరోపణలపై విచారణ కొనసాగనుంది. ఈ పరిణామం వెనిజులా-అమెరికా సంబంధాలను మరింత ఉద్రిక్తంగా మార్చే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.

డెల్సీ రోడ్రిగ్జ్ గతంలో విదేశాంగ మంత్రిగా, ఉపాధ్యక్షురాలిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో అనుభవం ఉన్న నేతగా ఆమెకు పేరుంది. తాత్కాలికంగా అయినా ఆమె నాయకత్వంలో దేశాన్ని స్థిరపరిచే ప్రయత్నం జరుగుతుందని ప్రభుత్వం వర్గాలు భావిస్తున్నాయి. మదురో అరెస్ట్ తర్వాత వెనిజులాలో రాజకీయ భవిష్యత్ ఏ దిశగా సాగుతుందన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories