Happy Valentine's Day 2020: వాలెంటైన్స్ డే వెనుక ఉన్న అసలు కథ ఇదే

Happy Valentines Day 2020: వాలెంటైన్స్ డే  వెనుక ఉన్న అసలు కథ ఇదే
x
ప్రేమికుల రోజు ప్రతీకాత్మక చిత్రం
Highlights

'వాలెంటైన్స్ డే' నేపథ్యంలో (ఫిబ్రవరి 14) మీరు ఎంతగానో ప్రేమించే వ్యక్తికి ప్రేమ కురించి చెప్పలానుకుంటున్నారా?

'వాలెంటైన్స్ డే' నేపథ్యంలో (ఫిబ్రవరి 14) మీరు ఎంతగానో ప్రేమించే వ్యక్తికి ప్రేమ కురించి చెప్పలానుకుంటున్నారా? అయితే ఈ రోజు చెప్పేయండి. ప్రేమను ఎప్పుడైనా వ్యక్తం చేయొచ్చు. అయితే ఈ రోజు మీ మనస్సులోని భావాన్ని తెలపడానికి ఒ కారణం ఉంది. దీని వెనుక ఓ చరిత్ర దాగి ఉంది. వాలెంటైన్స్ డే అంటే మీకు తెలుసా? . ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు ఎందుకు జరుపుకుంటారు. ఇప్పుడు చూద్దాం?

వాలెంటైన్ డే అంటే ముందుగా గుర్తుకు వచ్చేది. వాలెంటైన్ అసలు వాలెంటైన్ అతని గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకం 270 లో హింస, స్వార్థం, ద్వేషం లాంటి చెడుపై పోరాడటానికి ప్రేమ తప్ప మరో ఆయుధం లేదని నమ్మే వ్యక్తి క్రైస్తవ మతగురువు వాలెంటైన్. వాలెంటైన్ రోమ్‌లో నివాసం ఉండేవారు. ఆయన తాను నమ్మిన ప్రేమ సిద్ధాంతాన్ని ఇతరులకు భోదించేవారు. అలా వాలెంటైన్ సిద్ధాంతాన్ని బోధిస్తూ.. యువతీ యువకుల మధ్య ప్రేమ చిగురించేలా చేసేవారు. అంతేకాదు యువతీయువకులకు ప్రేమలో ఉన్న వారికి దగ్గరుండి మరీ వివాహం జరిపించేవారు.

అయితే అదే సమయంలో రోమ్‌ను పాలిస్తున్న క్లాడియస్ అనే చక్రవర్తి ఉండే వారు. అతని మనస్సు క్రూరత్వంలో నిండి ఉండేది. క్లాడియస్ కు ప్రేమ పెళ్లిళ్లు కాదు ఇష్టం లేదు. అందుకే రోమ్‌లో ప్రేమ పెళ్లిళ్లపై నిషేధం విధించాడు. పెళ్లిళ్లు అంటే ఇష్టం లేని క్లాడియస్ రాజు... ప్రేమ పెళ్లిళ్లను ప్రోత్సహిస్తున్న వాలెంటైన్. క్లాడియస్ రాజ్యంలో ప్రేమ వివాహాలు ఎక్కువైపోయాయి. దీనిపై క్లాడియస్ ఆరా తీశాడు. వాలెంటైన్ అనే మతగురువు ప్రేమ గురించి చెబుతూ... పెళ్లిళ్లకు చేస్తున్నట్లు క్లాడియస్ సమాచారం అందింది. దీంతో క్లాడియస్ వాలెంటైన్ ని బంధించాడు.

కాగా.. వాలెంటైన్ రాజు ఆజ్ఞను దిక్కరించాడన్న ఆరోపణలతో అతని మరణశిక్ష విధించాడు. ఈ నేపథ్యంలో ఎంతోమంది ప్రేమ వివాహాలు జరిపిన వాలెంటైన్... జైలులో ఉండగానే ఓ అధికారి కూతురితో ప్రేమలో పడ్డాడు. వాలెంటైన్‌కు ఉరిశిక్ష సమయం వచ్చింది. దీంతో ఫిబ్రవరి 14న వాలెంటైన్‌ను ఉరితీశారు. వాలెంటైన్‌ మరణించేవరకు ప్రియురాలి గురించే తలచుకుంనేవాడు. ప్రియురాలికి ఇచ్చే లేఖలో 'Your Valentine' అనే మాట వాడేవాడు.

ఈ క్రమంలో ఫిబ్రవరి 14న వాలెంటైన్‌ను ఉరి తీశారు. ఎందరో యువతీయువకుల ప్రేమ వివాహాలకు కారణమైన వాలెంటైన్ మరణించిన రోజే‎ ప్రేమికుల రోజు గా జరుపుకోవడం మొదలు పెట్టారు. దీనినే వాలెంటైన్స్ డే గా పిలుస్తారు. మనదేశంలో మాత్రం ప్రేమికుల రోజును జరుపుకోవడం 1990వ దశకంలో మొదలు పెట్టారు. మన దేశంలో 1990వ దశంలో ప్రేమ పేరుతో ఎన్నో సినిమాలు వచ్చాయి.

అయితే కొంతమంది మాత్రం పాశ్చాత్య దేశాల సంస్కృతి మన దేశంలో రావడంపై వ్యతిరేకిస్తూ ధర్నాలు, ఆందోళనలు, చేస్తున్నారు. ఇక ప్రేమకు ఒక రోజు ఏంటని కొందరు ప్రశ్నింస్తున్నారు. మరి కొందరు కార్పొరేట్ కంపెనీలు సృష్టించిన మాయ ఆరోపిస్తున్నారు. ఎందుకంటే వాలెంటైన్స్‌ డే పేరుతో వందల కోట్ల రూపాయలు వ్యాపారాలు జరుగుతున్నాయని అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories