Venezuela: వెనిజులాపై అమెరికా మెరుపుదాడులు.. 40 మంది మృతి, అధ్యక్షుడు మదురో అమెరికాకు తరలింపు..!!

Venezuela: వెనిజులాపై అమెరికా మెరుపుదాడులు.. 40 మంది మృతి, అధ్యక్షుడు మదురో అమెరికాకు తరలింపు..!!
x
Highlights

Venezuela: వెనిజులాపై అమెరికా మెరుపుదాడులు.. 40 మంది మృతి, అధ్యక్షుడు మదురో అమెరికాకు తరలింపు..!!

Venezuela: వెనిజులాలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అమెరికా చేపట్టిన మెరుపు దాడుల్లో కనీసం 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, మృతుల్లో సాధారణ పౌరులతో పాటు వెనిజులా భద్రతా బలగాలకు చెందిన సైనికులు కూడా ఉన్నారు. ఈ దాడులు వెనిజులాలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరిగాయని తెలుస్తోంది.

ఈ దాడులతో పాటు మరింత సంచలన పరిణామం చోటుచేసుకుంది. వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మదురోను, ఆయన భార్యను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించినట్లు సమాచారం. వీరి విమానం కొద్దిసేపటి క్రితమే న్యూయార్క్‌లోని స్టీవర్ట్ ఎయిర్ నేషనల్ గార్డ్ బేస్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి వీరిని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ (MDC) కు తరలించే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి.

అమెరికా దాడులు, మదురో అరెస్టు వార్తలతో లాటిన్ అమెరికా దేశాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వెనిజులా సార్వభౌమత్వంపై అమెరికా చర్యలు ఉల్లంఘన అని పలుదేశాలు ఖండిస్తున్నాయి. మరోవైపు పౌరుల మరణాలపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories