అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం!

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం!
x
Highlights

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ట్రంప్, బైడెన్ భవితవ్యం తేల్చేందుకు అమెరికన్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ట్రంప్, బైడెన్ భవితవ్యం తేల్చేందుకు అమెరికన్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇఫ్పటికే 10కోట్ల మంది ఓటర్లు ముందస్తుగా ఓటు హక్కు వినియోగించుకోగా.... మరో 6కోట్ల మంది ఇప్పుడు ఓటేయనున్నారు. మొత్తానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అగ్రరాజ్యం పీఠం దక్కించుకునేది ఎవరో తేల్చేందుకు అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

అభ్యర్థుల భవితవ్యంపై ఇప్పటికే పలు సంస్థలు ప్రీపోల్స్‌ నిర్వహించాయి. అత్యధిక సర్వేలు డెమొక్రాటిక్‌ అభ్యర్థి బైడెన్‌ వైపే మొగ్గుచూపినా... రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ ఓటమిని మాత్రం ఖాయం చేయలేకపోయాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ట్రంప్, బైడెన్‌ ఇద్దరు అభ్యర్థుల మధ్య తేడా క్రమంగా తగ్గుతూ రావటం... అమెరికా ఎన్నికలపై మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. అధ్యక్షుడి గెలుపులో కీలకమైన రాష్ట్రాల్లో ట్రంప్‌ కంటే బైడెన్ కేవలం 2.9 శాతం పాయింట్లతో ముందజలో ఉన్నారు. దీంతో బైడెన్‌ గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది.

బైడెన్‌ ఆధిక్యం గత కొన్ని రోజుల్లోనే భారీగా క్షీణించినట్లు సర్వేలు వెల్లడించాయి. ట్రంప్‌తో పాటు ఆయన బృందం ముఖ్యంగా కుటుంబ సభ్యులు చేసిన సుడిగాలి ర్యాలీలే దీనికి కారణమని తెలుస్తోంది. గత కొన్ని రోజుల్లో ట్రంప్‌ స్వయంగా 15 ర్యాలీల్లో పాల్గొన్నారు. కీలక రాష్ట్రాల్లో ఐదు సభలు నిర్వహించారు. ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్‌ పెన్స్‌ సహా ఆయన కుటుంబ సభ్యులు మూడు రోజుల్లో 40 సభల్లో పాల్గొని ఓటర్లను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు.

రియల్‌ క్లియర్‌ పాలిటిక్స్‌ అంచనా ప్రకారం.. ట్రంప్‌ కంటే బైడెన్‌ 6.5 పాయింట్ల ముందంజలో ఉన్నారు. కొన్నిరోజుల క్రితం ఈ తేడా ఎనిమిది నుంచి తొమ్మిది పాయింట్లుగా ఉండేది. ఇక ప్రధాన మీడియా సంస్థల సర్వేలన్నీ ట్రంప్‌ గెలుపు కష్టమేనని అభిప్రాయపడుతున్నాయి. కానీ, ఓటమి మాత్రం ఖాయమని తేల్చి చెప్పలేకపోయాయి. 2016 అధ్యక్ష ఎన్నికల్లో సర్వేలు హిల్లరీ క్లింటన్ గెలుపు ఖాయమని చెప్పినా.. అందుకు అనూహ్యంగా ఫలితం వచ్చింది. దీంతో ఈసారి కూడా అలా జరగదని హామీ ఇవ్వలేమని అభిప్రాయపడింది న్యూయార్క్‌ టైమ్స్‌. ఇక చాలా వరకు మీడియా సంస్థలు బైడెన్‌ గెలుపు అవకాశాలు 50 శాతానికి పైగా ఉన్నట్లు చెబుతూ.. ట్రంప్‌ గెలుపు శాతం 40 నుంచి 42 శాతమే అంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories