Trump Tariffs: మెక్సికోకు ఉపశమనం..నెలపాటు సుంకాలు నిలిపివేసిన ట్రంప్

Trump Tariffs: మెక్సికోకు ఉపశమనం..నెలపాటు సుంకాలు నిలిపివేసిన ట్రంప్
x
Highlights

Trump Tariffs: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఇతర దేశాలపై సుంకాలు విధించారు. ఇప్పుడు ఇతర దేశాలు దీనిపై...

Trump Tariffs: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఇతర దేశాలపై సుంకాలు విధించారు. ఇప్పుడు ఇతర దేశాలు దీనిపై స్పందిస్తున్నాయి. అమెరికా విధించిన సుంకం తర్వాత కెనడా కూడా అమెరికన్ వస్తువులపై సుంకాలను ప్రకటించింది. ఈ మేరకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్ బామ్ లతో ట్రంప్ మాట్లాడారు.

సుంకాలు విధించే విషయంలో పొరుగు దేశం మెక్సికోకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్షణ ఉపశమనం కల్పించారు. మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌తో చాలా స్నేహపూర్వకంగా మాట్లాడిన తర్వాత ట్రంప్ ఒక నెల పాటు సుంకాలను వెంటనే నిలిపివేయడానికి అంగీకరించారు. డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లోని తన పోస్ట్‌లలో ఒకదానిలో ఈ సమాచారాన్ని అందించారు. నేను ఇప్పుడే మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌తో మాట్లాడాను. ఇది చాలా స్నేహపూర్వక సంభాషణ, దీనిలో అతను మెక్సికో, యునైటెడ్ స్టేట్స్‌లను వేరు చేసే సరిహద్దుకు 10,000 మంది మెక్సికన్ సైనికులను వెంటనే సరఫరా చేయడానికి అంగీకరించాడు. మన దేశంలోకి ఫెంటానిల్, అక్రమ వలసదారుల ప్రవాహాన్ని ఆపడానికి ఈ దళాలను ప్రత్యేకంగా నియమిస్తామని ట్వీట్ చేశారు ట్రంప్ .

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుంకాల విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు ట్రంప్. ఈమధ్యే మెక్సికో, కెనడా దిగుమతులపై 25శాతం సుంకాలను విధిస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే దీనిపై రెండు దేశాలు ప్రతీకార చర్యలకు రెడీ అయ్యాయి. అయితే తాజాగా ట్రంప్ వెనక్కు తగ్గారు. మెక్సికన్ వస్తువులపై ఒక నెలపాటు సుంకాలను నిలుపుదల చేసేందుకు ట్రంప్ అంగీకారం తెలిపారు.


ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్యలు కొనసాగుతాయని ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్ బామ్ తో చర్చలు జరిపిన తర్వాత ఈ ప్రకటన చేశారు. మెక్సికో, అమెరికా భద్రత, వాణిజ్యంపై పనిచేయం ప్రారంభిస్తాయని షీన్ భామ్ కూడా ధ్రువీకరించారు. ఒప్పందాల్లో భాగంగా మాదకద్రవ్యాల అక్రమరవాణాపై పోరాడేందుకు మెక్సికో 10, 000 మంది నేషనల్ గార్డ్ సభ్యులను యునైటెడ్ స్టేట్స్ తో సరిహద్దు వెంబడి మోహరించనుందని ఆమె తెలిపారు. ఈమధ్యే ట్రంప్, కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. కెనడా, మెక్సికో దిగుమతులపై 25శాతం, చైనా నుంచి వచ్చే వస్తువులపై 10శాతం సుంకాన్ని ట్రంప్ విధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories