కరోనా ఎఫెక్ట్‌: అమెరికాలో నేషనల్‌ ఎమర్జెన్సీ

కరోనా ఎఫెక్ట్‌: అమెరికాలో నేషనల్‌ ఎమర్జెన్సీ
x
Highlights

విస్తరిస్తున్న కరోనావైరస్ మహమ్మారిపై పోరాడటానికి ప్రపంచం దేశాలు సమాయత్తమైన తరుణంలో అమెరికా కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని దృష్ట్యా...

విస్తరిస్తున్న కరోనావైరస్ మహమ్మారిపై పోరాడటానికి ప్రపంచం దేశాలు సమాయత్తమైన తరుణంలో అమెరికా కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని దృష్ట్యా దేశంలో ఎమర్జెన్సీ(నేషనల్‌ ఎమర్జెన్సీ) విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటన చేశారు. అదే విధంగా కరోనాను అరికట్టేందుకు 50 బిలియన్‌ డాలర్ల నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. శ్వేతసౌధంలో జరిగిన పత్రికా సమావేశంలో ట్రంప్‌ ప్రకటన చేశారు. అలాగే ఆరు రాష్ట్రాల గవర్నర్లు ఫ్లోరిడా, అయోవా, లూసియానా, న్యూయార్క్, రోడ్ ఐలాండ్ మరియు వాషింగ్టన్ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని జాతీయ భద్రతా దళాలను ఆశ్రయించారు.

ఐరోపా, ఉత్తర అమెరికా మరియు మిడిల్ ఈస్ట్ దేశాలు వైరస్ వ్యాప్తిని త్వరితగతిన నియంత్రించాలని తీవ్రంగా కృషి చేస్తున్నాయి. డజన్ల కొద్దీ దేశాలు గత రెండు రోజులుగా పెరుగుతున్న కేసులతో కఠినమైన చర్యలను విధించాయి.. అందులో ముఖ్యంగా సరిహద్దులను మూసివేయడం, పరీక్షలను విస్తరించడం, పాఠశాలలు, సినిమా హాళ్లు మూసివేయడం వంటి చర్యలకు ఉపక్రమించారు. అంతేకాదు ఇతర దేశాల నుంచి ఎవరిని రాకుండా వీసా ఆంక్షలు విధించాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories