Top
logo

H1B Visa: హెచ్‌ 1-బీ వీసా హోల్డర్స్‌కి గుడ్‌ న్యూస్

Biden admin to reconsider Trumps adverse decisions
X

H1bVisa

Highlights

H1-B Visa: ట్రంప్‌ ఆదేశాల అమలుకు జో బైడెన్ బ్రేకులు

H1-B Visa: హెచ్‌ 1-బీ వీసా హోల్డర్స్‌కి గుడ్‌ న్యూస్.. ట్రంప్‌ ఇచ్చిన ఆదేశాల అమలుకు జో బైడెన్ బ్రేకులు వేశారు. బైడెన్ నిర్ణయంతో లక్షలాది మంది విదేశీ ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటున్నారు. హెచ్1-బీ వీసాల విషయంలో ట్రంప్ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని ఏళ్లుగా దేశీ కంపెనీలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అమెరికన్లకు మేలు చేసి, మరోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవడానికి ట్రంప్‌ హెచ్1-బీ వీసాల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా హెచ్1-బీ వీసాపై అమెరికాకు వచ్చే విదేశీయుల జీతాలను భారీగా పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. విదేశీ నిపుణులకు అమెరికా సంస్థలు పెద్ద మొత్తంలో జీతాలు చెల్లించలేక, అమెరికా పౌరులకు ఉద్యోగాలు కల్పించాయి. దీంతో విదేశీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ట్రంప్ నిర్ణయాన్ని అంతర్జాతీయ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పుడు ట్రంప్‌ ఆదేశాలకు బ్రేకులు వేసేలా జో బైడెన్ ఉత్తర్వులు జారీ చేశారు. విదేశీ ఉద్యోగుల వేతన పెంపు నిర్ణయం మే 14 వరకు అమలులోకి రాకుండా డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఆ తర్వాత ట్రంప్ ఆదేశాలను అమలు చేయాలా? వద్దా? అనే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Web TitleH1-B Visa: US President Biden admin to reconsider Trump's adverse decisions on H1B visa
Next Story