Trump: బైడెన్ చేయలేనిది మేము చేశాము.. మీరు ఎక్కడ ఉన్నా కనుగొని మరీ మట్టుబెడతా

Trump: బైడెన్ చేయలేనిది మేము చేశాము.. మీరు ఎక్కడ ఉన్నా కనుగొని మరీ మట్టుబెడతా
x
Highlights

Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన వెంటనే తన కఠిన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. సోమాలియాలోని ఐసిస్ లక్ష్యాలపై అమెరికా సైన్యం...

Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన వెంటనే తన కఠిన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. సోమాలియాలోని ఐసిస్ లక్ష్యాలపై అమెరికా సైన్యం వైమానిక దాడులు నిర్వహించిందని ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తెలిపారు. సోమాలియా గుహల్లో దాక్కున్న చాలా మంది ఉగ్రవాదులను అమెరికా వైమానిక దాడుల ద్వారా హతమార్చిందని ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్ ట్వీట్ చేస్తూ సోమాలియాలో గుహల్లో దాక్కున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను మట్టుబెట్టాలని ఆ దేశాలు జారీ చేశాను. ఉగ్రవాదులను సైనిక వైమానిక దళాలు మట్టుబెట్టాయి. వీరితో అమెరికాకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ట్రంప్ రాశారు. ట్రంప్ మాట్లాడుతూ, 'మా దాడులు ఈ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు నివసించిన గుహలను ధ్వంసం చేశాయి. పౌరులకు ఎలాంటి హాని కలగకుండా చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మన సైన్యం కొన్నేళ్లుగా ఈ ISIS దాడికి ప్లాన్ చేసేవారిని, ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుందని తెలిపారు. మాజీ అధ్యక్షుడు బైడెన్ చేయని పనిని తాము చేసిన చూపించామని ట్రంప్ అన్నారు.


ఐఎస్‌ఐఎస్, అమెరికన్లపై దాడి చేసే ఇతరులందరికీ సందేశం ఏమిటంటే..మీరు ఎక్కడ ఉన్నా కనుగొని మరీ మట్టుబెడతా మంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories