161 మంది భారతీయులను వెనక్కిపంపిచనున్న అమెరికా, కారణం ఇదే..

161 మంది భారతీయులను వెనక్కిపంపిచనున్న అమెరికా, కారణం ఇదే..
x
Representational Image
Highlights

మెక్సికో బోర్డర్‌ నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన 161 మంది భారతీయులను యూఎస్ ప్రభుత్వం వెనక్కి తిప్పి పంపాలని నిర్ణయించింది.

మెక్సికో బోర్డర్‌ నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన 161 మంది భారతీయులను యూఎస్ ప్రభుత్వం వెనక్కి తిప్పి పంపాలని నిర్ణయించింది. వీరందరూ అమెరికాలోకి తప్పుడు మార్గం ద్వారా ప్రవేశించిన కారణంగా వారిని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. అయితే వారిని ప్రత్యేక విమానం ద్వారా పంజాబ్‌లోని అమృత్‌సర్‌కి పంపించనున్నట్టు సమాచారం. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిలో అత్యధికంగా 76 మంది హర్యానా రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు.. ఆ తరువాత పంజాబ్‌ నుంచి 56 మంది, గుజరాత్‌ నుంచి 12 మంది, ఉత్తరప్రదేశ్‌ నుంచి 5 మంది, మహారాష్ట్ర నుంచి నలుగురు, కేరళ, తెలంగాణ, తమిళనాడు నుంచి ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌, గోవా నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

వీరిలో ముగ్గురు మహిళలు ఉండటమే కాకుండా హర్యానాకు చెందిన 19 యేళ్ల యువకుడు కూడా ఉన్నాడు. నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ (నాపా) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నం సింగ్ చాహల్ ప్రకారం, వారు అమెరికా అంతటా 95 జైళ్ళలో మగ్గుతున్న 1,739 మంది భారతీయులు ఉంటున్న చోట ఉన్నారు. వారిని ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది పూర్తయిన వెంటనే వారిని భారత్ కు పంపించనున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories