మసూద్ అజర్‌ విషయంలో చైనాను చీదరించుకుంటున్న ప్రపంచదేశాలు

మసూద్ అజర్‌ విషయంలో చైనాను చీదరించుకుంటున్న ప్రపంచదేశాలు
x
Highlights

పుల్వామా ఉగ్రదాడికి సూత్రదారి, కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు...

పుల్వామా ఉగ్రదాడికి సూత్రదారి, కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు నిర్ణయించుకున్నాయి. అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని మూడు దేశాలు కలిసి ఐక్య రాజ్యసమితిలో తీర్మానం ప్రవేశపెట్టాయి. ఐక్య రాజ్యసమితి భద్రతామండలిలోని 15 సభ్య దేశాల్లోని 14 దేశాలు ఈ తీర్మానాన్ని ఆమోదించగా ఒక్క చైనా మాత్రమే పెండింగులో పెట్టింది.

ఐతే తీర్మానాన్ని ఎందుకు అడ్డుకున్నారో రెండు వారాల్లో వివరించాలని చైనాను అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌ డిమాండ్ చేశాయి. చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా, ఇటీవల భద్రతామండలిలో మరో తీర్మానం ప్రవేశపెట్టింది. మరోవైపు ఈ తీర్మానాన్ని బలవంతంగా ఆమోదింపచేసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని చైనా ఆరోపిస్తోంది. అమెరికా చర్యతో మసూద్‌ సమస్య పరిష్కారం క్లిష్టమవుతుందని అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. మసూద్ విషయంలో చైనా అనుసరిస్తున్న విధానాన్ని ప్రపంచదేశాలు చీదరించుకుంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories