అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేతపై కలకలం

అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేతపై కలకలం
x

అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేతపై కలకలం

Highlights

అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేత పెద్ద ఎత్తున నేషనల్ గార్డ్స్ మొహరింపు డెమొక్రాట్స్ పాలిత రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత షికాగో నగరంలో ప్రతిఘటించిన స్థానికులు ట్రంప్ అవసరం లేదంటూ భారీ ర్యాలీలు షికాగో మేయర్, ఇల్లినాయి గవర్నర్‌లను..

అక్రమవలసదారులను ఏరివేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన చర్యలు అలజడిని రేపుతున్నాయి. వలసదారులను గుర్తించేందుకు వస్తున్న ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులను స్థానికులు ప్రతిఘటిస్తున్నారు. ముఖ‌్యంగా డెమొక్రాట్స్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ట్రంప్ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. దీంతో ఆ రాష్ట్రాలను పెద్ద ఎత్తున నేషనల్ గార్డ్స్‌ను పంపడం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో షికాగో మేయర్‌ బ్రాండన్‌ జాన్సన్‌, ఇల్లినోయీ గవర్నర్‌ జేబీ ఫ్రిట్కర్‌‌ల మీద ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ట్రంప్ తమ రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని వారు ధ్వజమెత్తారు.


అక్రమ వలసదారులపై కఠిన వైఖరిని అవలంభిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఒక్కో రాష్ట్రంలో అక్రమ వలసదారులను ఏరి వేస్తూ వస్తున్నారు. అక్రమ వలసదారులకు గుర్తించి వారి స్వదేశాలకు తిప్పి పంపేస్తున్నారు. అయితే ఈ తనిఖీలను వలసదారులతో పాటు స్థానికులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా డెమోక్రటిక్‌ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. తనిఖీలకు వ్యతిరేకంగా వలస సేవల కేంద్రాల వద్ద తరచూ ఆందోళనలు జరుగుతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు కేంద్ర బలగాలను ట్రంప్‌ యంత్రాంగం రంగంలోకి దించింది. బాల్టిమోర్, మెంఫిస్, ద డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా, న్యూ ఆర్లీన్స్, ఓక్‌లాండ్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ ఏంజెలెస్, షికాగో తదితర నగరాలకు నేషనల్ గార్డ్స్‌ను పంపారు. షికాగోకు కూడా 400 మంది కేంద్ర బలగాలను పంపించారు.


తనిఖీలు చేసేందుకు వచ్చిన నేషనల్ గార్డ్స్‌ను స్థానికులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. వారిపై దాడులకు కూడా నిర్వహిస్తున్నారు. షికాగోలోని వలస సేవల కేంద్రాల దగ్గర తరచూ ఆందోళనలు జరుగుతున్నాయి. వీటిని అణిచి వేయాలని అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. కానీ డెమొక్రటిక్ పార్టీకి చెందిన షికాగో మేయర్‌ బ్రాండన్‌ జాన్సన్‌, ఇల్లినోయీ గవర్నర్‌ జేబీ ఫ్రిట్కర్‌ లు ట్రంప్ ఆదేశాలను బే‌ఖాతరు చేస్తున్నారు. దీంతో వీరిద్దరి మీద అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను రక్షించడంలో వారు విఫలం అయ్యారని ఆరోపించారు. అక్కడి ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు భద్రత కల్పించలేకపోయారని...ఇందుకు గానూ మేయర్, గవర్నర్ లను జైల్లో పెట్టాలని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. షికాగో నేరగాళ్లకు అడ్డాగా మారిందని ధ్వజమెత్తారాయ.


కాగా ట్రంప్ చర్యలను షికాగో మేయర్‌ బ్రాండన్‌ జాన్సన్‌, ఇల్లినోయీ గవర్నర్‌ జేబీ ఫ్రిట్కర్‌ తప్పుపడుతున్నారు. ట్రంప్ బెదిరింపుపై ప్రిట్జ్ కర్ స్పందించారు. డెమోక్రటిక్ పాలనలో ఉన్న రాష్ట్రాలు నగరాలకే ట్రంప్ నేషనల్ గార్డ్స్ ను పంపించడం దారుణమని వారు వ్యాఖ్యానించారు. ట్రంప్ రాష్ట్రాలకు ఉన్న అధికారాలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నా ప్రజలను కాపాడుకోవడానికి తాను ఎప్పుడూ ముందుంటానని..రండి నన్ను అరెస్ట్ చేయండి అంటూ గవర్నర్‌ జేబీ ఫ్రిట్కర్‌ ప్రకటించారు. దాంతో పాటూ ట్రంప్ ఒక నియంత అని ధ్వజమెత్తారు.



ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక దేశంలోని అనేక నగరాలకు కేంద్ర బలగాలను పంపాలని తీసుకున్న నిర్ణయం వివాదాస్పంగా మారింది. ఇప్పటికే బాల్టిమోర్, మెంఫిస్, ద డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా, న్యూ ఆర్లీన్స్, ఓక్‌లాండ్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ ఏంజెలెస్, షికాగో తదితర నగరాలకు బలగాలను పంపారు. అయితే, పోర్టులాండ్‌కు వందల సంఖ్యలో భద్రతా దళాలను పంపాలన్న నిర్ణయాన్ని ఫెడరల్‌ కోర్టు అడ్డుకుంది. కేవలం చిన్న ఆందోళనలను కారణంగా చూపి కేంద్ర బలగాలను పంపాలని నిర్ణయించడం అనుచితమని పేర్కొంది.ఈ క్రమంలో చాలా చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ట్రంప్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. షికాగో నగరంలో మాకు ట్రంప్ అవసరం లేదంటూ భారీ ర్యాలీ నిర్వహించారు.


మరోవైపు నేషనల్ గార్డులను స్థానికులు ఆటపట్టిస్తున్నారు. తాజాగా షికాగో నగరంలో ఓ సైకిస్టు వారిని వెక్కిస్తూ రెచ్చగొట్టాడు. మీరు వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్ చేశాడు. అయితే ఈ వ్యక్తిని వారు పెద్దగా పట్టించుకోలేదు. ఆ వ్యక్తి నేషనల్ గార్డ్స్ మీదకు రాయితో దాడి చేయబోగా వారు అప్రమత్తమయ్యారు. అతని వెంట పడి పట్టుకునేందుకు వారు పరుగెత్తారు. అయితే సైకిస్టు వారికి చిక్కకుండా అక్కడి నుంచి తుర్రుమన్నాడు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరట్ అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories