మలాలాకు మరో అరుదైన ఘనత

మలాలాకు మరో అరుదైన ఘనత
x
మలాలాయూసఫ్ జాయ్,
Highlights

నోబెల్ శాంతి అవార్డు గ్రహిత మలాలా యూసఫ్‌జాయ్‌ మరో సారి వార్తల్లోకి ఎక్కింది. మరోసారి అరుదైన ఘనత సొంతం చేసుకుంది.

నోబెల్ శాంతి అవార్డు గ్రహిత మలాలా యూసఫ్‌జాయ్‌ మరో సారి వార్తల్లోకి ఎక్కింది. మరోసారి అరుదైన ఘనత సొంతం చేసుకుంది.ఈ దశాబ్దానికి అత్యంత ప్రఖ్యాత టీనజర్‌గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. బాలికల విద్యా కోసం మలాలా చేసిన పోరాటానికి ఆగ్రహించిన తాలిబన్లు ఆమె కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. 2011లో ఐక్యరాజ్యసమితి మలాలాను శాంతి రాయబారిగా నియమించారు.

అయితే తాజా మరోసారి ఐక్యరాజ్యసమితి నుంచి ఆమెకు మరో ఘనత దక్కింది. 2010 నుంచి 2013 వరకు మూడు సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన వివిధ పరిణామాలను పరిగణనలోకి తీసుకుంది. డెకేడ్‌ ఇన్‌ రివ్యూ అనే నివేదక ఆధారంగా అంతర్జాతీయ సంస్థ ఇటీవల ప్రకటించింది.

అంతర్జాతీయ సంస్ధ నివేదికలో 2010 సంవత్సరంలో ప్రళయాణ్ని సృష్టించిన హైతీ భూకంపం, 2011లో సిరియా అంతర్యుద్ధం మొదలై

ఇప్పటి వరకు కొనసాగుతుంది. అలాగే 2012లో బాలికల విద్య కోసం పొరాడిన మలాలా కృషి వంటి సంఘటనలను ప్రధానాంశాలుగా ప్రకటించింది.

అత్యంత చిన్న వయసులో నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తిగా పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్‌జాయ్ చరిత్ర సృష్టించింది. భారత్ కు చెందిన వ్యక్తి కైలాశ్ సత్యార్థితో పాటు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి అందుకుంది. అప్పట్లో మలాలాపై జరిగిన హత్యాయత్నం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలను రేపింది. ఈ అమానవీయ ఘటనపై నిరసనలు చెలరేగాయి. 2012లో మానవ హక్కుల రోజు సందర్భంగా యునెస్కో మలాలాకు ప్రత్యేక అభినందనలు తెలిపింది. ప్రతి బాలిక బడికి వెళ్లటం హక్కుగా రూపొదడానికి, బాలికలకు చదువు అత్యవసర అంశంగా మరడానికి మలాలా చూపిన కృషి ప్రశంసనీయం అని తెలిపిందని ఐక్యరాజ్యసమితి తమ నివేదికలో పేర్కొంది.

పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తినందకు వారు మలాలాను తీవ్రంగా గాయపరిచిన విషయం తెల్సిందే. డాక్టర్లు ఏడు గంటల పాటు శ్రమించి ఆమె వెన్నెముకలో ఉన్న బుల్లెట్‌ను తొలగించారు. మలాలా యూసఫ్ జాయ్ జీవిత చరిత్ర ఐయామ్ మలాలా అనే పుస్తకం పేరిట రూపంలో వచ్చింది. తెలుగులో కూడా నేను మలాలా అనే పేరుతో అనువాదమైంది. తాలిబన్ల దాడిలో గాయపడిన మలాలా యూసఫ్ జాయ్ తన జ్ఞాపకాలను పుస్తక రూపంలోకి తీసుకువచ్చింది.


Show Full Article
Print Article
Next Story
More Stories