కరోనా వైరస్ కి మందు కనిపెట్టామని అంటున్న యుకే శాస్త్రవేత్తలు..

కరోనా వైరస్ కి మందు కనిపెట్టామని అంటున్న యుకే శాస్త్రవేత్తలు..
x
Highlights

కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ఒక మార్గం దొరికింది. మహమ్మారి కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల ప్రాణాలను కాపాడటానికి దివ్యౌషధంగా డెక్సమెథసోన్...

కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ఒక మార్గం దొరికింది. మహమ్మారి కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల ప్రాణాలను కాపాడటానికి దివ్యౌషధంగా డెక్సమెథసోన్ సహాయపడుతుంది. ఈ స్టెరాయిడ్ ద్వారా మృత్యువుతో పోరాడుతున్న వారు కూడా కోలుకుంటున్నట్లు యూకే పరిశోధకులు బిబిసికి చెప్పారు. డెక్సమెథసోన్ వాడటం ద్వారా ఇప్పటివరకూ ఒక్క యూకేలోనే దాదాపు 5 వేల మందిని ప్రాణాపాయం నుంచి రక్షించినట్టు తెలిపారు. తక్కువ-మోతాదు స్టెరాయిడ్ చికిత్స డెక్సమెథసోన్ ఘోరమైన వైరస్ కు వ్యతిరేకంగా పోరాటంలో ప్రధాన పురోగతి అని.. ఈ జనరిక్ స్టెరయిడ్ డ్రగ్ అద్భుతంగా పని చేస్తోందని.. పైగా ఇది అతి తక్కువ ధరకే లభిస్తుందని యుకె నిపుణులు స్పష్టం చేశారు.

యూకేలోని వివిధ ఆసుపత్రుల్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న 11,500 మందికిపైగా బాధితులపై డెక్సామెథాసోన్‌ను ప్రయోగించారు. ఈ క్రమంలో వెంటిలేటర్లపై ఉన్న రోగులకు మరణ ప్రమాదాన్ని మూడవ వంతు తగ్గించింది. అలాగే ఆక్సిజన్ తో చికిత్స లో ఉన్నవారికి మరణాలను ఐదవ వంతు తగ్గించిందని నిర్ధారించారు. 'COVID-19 ఉన్న రోగులకు లేదా వెంటిలేటర్లలో ఉన్న లేదా ఆక్సిజన్ తో చికిత్స పొందుతున్న రోగులకు డెక్సమెథసోన్‌ ఇస్తే, అది ప్రాణాలను కాపాడుతుంది, ఇది చాలా తక్కువ ఖర్చుతో పనిచేస్తుంది' అని ఆక్స్ఫర్డ్ మార్టిన్ లాండ్రే చెప్పారు. ఆయన దీనిపై ప్రయోగానికి సహ-నాయకత్వం వహిస్తున్న విశ్వవిద్యాలయ ప్రొఫెసర్. ఏది ఏమైనా యూకే శాస్త్రవేత్తలు చెప్పినట్టు ఇది ప్రపంచం మొత్తం పనిచేసినట్టయితే అందరికి ఊరట కలిగిస్తుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories