విజ‌య్ మాల్యాకు షాక్.. త్వ‌ర‌లో ఇండియాకు అప్ప‌గింత‌

విజ‌య్ మాల్యాకు షాక్.. త్వ‌ర‌లో ఇండియాకు అప్ప‌గింత‌
x
Vijay Mallya (File Photo)
Highlights

భార‌త్‌లో తొమ్మిది వేల కోట్ల అక్ర‌మాల‌కు, మానీ లాండ‌రింగ్‌కు పాల్ప‌డి విదేశానికి పారిపోయిన విజ‌య్ మాల్యాకు లండ‌న్ కోర్టులో భారీ దెబ్బ‌త‌గిలింది....

భార‌త్‌లో తొమ్మిది వేల కోట్ల అక్ర‌మాల‌కు, మానీ లాండ‌రింగ్‌కు పాల్ప‌డి విదేశానికి పారిపోయిన విజ‌య్ మాల్యాకు లండ‌న్ కోర్టులో భారీ దెబ్బ‌త‌గిలింది. భార‌త్‌కు త‌న‌ను అప్ప‌గించ‌వ‌ద్దంటూ.. మాల్యా దాఖ‌లు చేసిన అప్పీల్‌ను కోర్టు కొట్టి వేసింది. ప‌లు కంపెనీ పేరుతో బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకొని వాటిని తీర్చుకుండా మాల్యా చేతులెత్తేశాడు.మాల్యాపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కేసులు న‌మోదు చేసి యూకేకు పారిపోయిన సంగ‌తి తెలిసిందే.

మాల్య‌ను భార‌త్ కు అప్ప‌గించాల‌ని సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ కోరాయి. లండ‌న్‌లోని రాయ‌ల్‌కోర్టు ఆఫ్ జ‌స్టిస్‌లోని లార్డ్ జ‌స్టిస్ స్టీఫెన్ ఇర్విన్‌, జ‌స్టిస్ ఎలిజ‌బెత్ లైంగ్‌ల‌తో కూడిన ద్విస‌భ్య బెంచ్ తీర్పు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో యూకే స్థానిక కోర్టు కూడా మాల్యాను భార‌త్‌కు అప్ప‌గించాల‌ని తీర్పునిచ్చింది. తాజాగా దీనిపై మాల్యా అప్పీల్ చేయ‌గా.. యూకే హైకోర్టు విచారించి క‌రోనా నేప‌థ్యంలో ఆన్ లైన్ ద్వారా తీర్పు వెల్ల‌డించింది. మ‌రోవైపు మాల్యాను అప్ప‌గించాల‌ని 2018 డిసెంబ‌ర్‌లో కోర్టు తీర్పునివ్వ‌గా.. దానిపై అత‌ను న్యాయపోరాటం చేస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories