44 మంది పిల్లలు కన్నది... గర్భాశయం తొలగించాలని ప్రభుత్వ ఆదేశం

44 మంది పిల్లలు కన్నది... గర్భాశయం తొలగించాలని ప్రభుత్వ ఆదేశం
x
Highlights

మహాభారతంలో గాంధారి వందమంది కౌరవులకు జన్మనించింది. నేడు కలియుగ గాంధరి మాత్రం 44మంది పిల్లలకు జన్మనించింది. ఇక ప్రభుత్వం అడ్డు చెప్పకపోతే కౌరవుల...

మహాభారతంలో గాంధారి వందమంది కౌరవులకు జన్మనించింది. నేడు కలియుగ గాంధరి మాత్రం 44మంది పిల్లలకు జన్మనించింది. ఇక ప్రభుత్వం అడ్డు చెప్పకపోతే కౌరవుల సంఖ్యలో సగానికి వచ్చేదే. ఈ రోజుల్లో ఒకరిద్దరు పిల్లలతో వేగడం కష్టం అలాంటిది. ఆమె ఏకంగా 40 ఏళ్లలో నలబైనాలుగు మంది పిల్లలకు తల్లిగా మారింది. అంటే మామూలు విషయమా! నమ్మలేకపోతున్నారా.. ఆశ్ఛర్యంగా ఉందా? నిజంగా ఇదీ నిజమే ఈ ఘటన ఉగాండాలో చోటుచేసుకుంది.

ప్రపంచంలో అత్యంత పేదరికం ఎక్కువగా ఉన్న దేశాల్లో ఉగాండా కూడా ఉంది. అయితే ఉగాండాకు చెందిన 40 ఏళ్ల మరియంకు 44 మంది పిల్లలకు జన్మనించ్చింది. వాస్తవానికి ఆమె అరుదైనా అండాశయం ఉంది. మరియంకు తన 12 ఏళ్లకే వివాహం జరిగింది. మరియంకు 13 ఏట కవలలుజన్మించారు. కవలలు చాలు అనుకొని ఆమె వైద్యులను సంప్రదించింది. తనకు గర్భం తీసేయాలని కోరింది. మరియంను పరీక్షించిన వైద్యులు కష్టమని చెప్పారు. గర్భాశయంలో అండాలు విడుదల వల్ల మరింయంకు ఇద్దరు నుంచి నలుగురు పిల్లలు జన్మించారు. భవిష్యత్తులో ఎక్కువ మంది కవలలు పుట్టే అవకాశం ఉందని తెలిపారు.

తన సమస్యకు పరిష్కారం చూపలేక వైద్యులు కూడా చేతులేత్తేశారు. దీంతో మరియంకు గర్భం దాల్చిన ప్రతీసారి ఇద్దరూ నుంచి నలుగురు కవల పిల్లలలు జన్మిస్తున్నారు. దీంతో ఆమె భర్త విడాకులు తీసుకున్నాడు. మరియంకు పుట్టిన పిల్లల్లో కొందరు పుట్టగానే చనిపోయారు. అలా ఆరుగురు పిల్లలు పుట్టగానే చనిపోయారు. దీంతో ఇప్పుడు ఆమెకు 38మంది పిల్లలు మాత్రమే జీవించి ఉన్నారు. మరియం తన పిల్లలను ఆమె చాలా బాగా చూసుకుంటుంది. మరియం చిన్నారులు చదువుల్లోనూ ఆటపాటల్లోనూ చక్కగా రాణిస్తున్నారు. వారి సాధించిన విజయాలకు గుర్తుగా ఇల్లాంతా మెడల్స్ లో నిండిపోయింది.

కానీ పిల్లలను పోషించడానికి ఆమె పడే క‌ష్టం వర్ణాతీతం. వారి పోషణలకు రోజుకు 24 కీలోలపైగా గోదుమ పిండి పడుతుందని ఆమె ఓ వార్త సంస్థకు చెప్పుకొచ్చింది. అరుదైన అండాశం వల్ల మళ్లీ గర్భం దాల్చితే ప్రాణాలకు ప్రమాదం అని వైద్యు తెలిపారని పేర్కొంది. తన భర్తకు మరో మహిళలతో కలిపి ఆయనకు 45మంది పిల్లున్నారని తెలిపింది. మరియం పరిస్థితి చూసి ఉగాండా ప్రభుత్వం ఆదుకోడానికి ముందుకొచ్చింది. పిల్లలను కనడం ఆపాలంటూ షరతు విధించింది. మరియం గర్భాశయాన్ని తొలగించాలని వైద్యులకు ఆదేశించింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories