'క్రూయిజ్ షిప్‌'లో కరోనా వైరస్ బారిన పడ్డ మరో ఇద్దరు భారతీయులు!

క్రూయిజ్ షిప్‌లో కరోనా వైరస్ బారిన పడ్డ మరో ఇద్దరు భారతీయులు!
x
Highlights

జపాన్ లో ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న క్రూయిజ్ షిప్‌లో మరో ఇద్దరు భారతీయులకు కరోనావైరస్(COVID-19) పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. రెండు రోజుల కిందట...

జపాన్ లో ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న క్రూయిజ్ షిప్‌లో మరో ఇద్దరు భారతీయులకు కరోనావైరస్(COVID-19) పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. రెండు రోజుల కిందట చేసిన కరోనావైరస్ పరీక్షలలో ఈ ప్రతికూలత వెలువడింది. అయితే వారిని పూర్తిస్థాయిలో పరీక్షించిన తరువాత స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాధ్యమైనంత సహాయం అందిస్తామని భారత్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం ఆదివారం తెలిపింది. ఓడలో COVID-19 బారిన పడిన వారి సంఖ్య ఆదివారం 355 కి పెరిగింది. "గత 2 రోజులలో, డైమండ్ ప్రిన్సెస్‌లో 137 కొత్త కేసులను కనుగొన్నారు.

దాంతో తాజాగా మరో ఇద్దరు భారతీయ పౌరులతో సహా, అందరిని చికిత్స కోసం సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరానికి తీసుకువెళ్లారు. ఇప్పటికే చికిత్స పొందుతున్న మరో ముగ్గురు భారతీయ సిబ్బంది, జ్వరం లేదని.. వైద్యానికి స్పందిస్తున్నారని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ఓడలో COVID-19 కోసం తుది పరీక్షలు ఫిబ్రవరి 17 న ప్రారంభమవుతాయని భారత రాయబార కార్యాలయం ఒక ట్వీట్‌లో పేర్కొంది. కాగా ఈ నెల ప్రారంభంలో జపాన్ తీరానికి చేరుకున్న డైమండ్ ప్రిన్సెస్ అనే ఓడలో ఉన్న 3,711 మందిలో 132 మంది సిబ్బంది మరియు 6 మంది ప్రయాణికులతో సహా మొత్తం 138 మంది భారతీయులు అందులో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

ఇదిలావుంటే కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 1700 కు పెరిగింది. అలాగే ఒక్క చైనాలోనే సంక్రమణ కేసుల సంఖ్య 70 వేలకు పెరిగింది. వీరిలో దాదాపు 11వేల మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్న వారి సంఖ్య 8 వేలకు కు పెరిగింది. ఈ అంటువ్యాధి వల్ల హుబే ప్రాంతం మరింత ఎక్కువగా ప్రభావితమైందని చైనాకు చెందిన జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. రెండు రోజుల వ్యవధిలో 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో 140 మంది దాకా మరణించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories