బైక్ నడుపుతూ జలకాలు: 5,500 జరిమానా

బైక్ నడుపుతూ జలకాలు: 5,500 జరిమానా
x
Highlights

ఎవరైనా స్నానం చేయాలనుకుంటే బాత్ రూంలో చేస్తారు. లేదా గ్రామాల్లో ఐతే చెరువులోనో, చేతి పంపుల దగ్గరో, లేదా బావి దగ్గరో చేస్తారు.

ఎవరైనా స్నానం చేయాలనుకుంటే బాత్ రూంలో చేస్తారు. లేదా గ్రామాల్లో ఐతే చెరువులోనో, చేతి పంపుల దగ్గరో, లేదా బావి దగ్గరో చేస్తారు. కానీ ఇద్దరు మహానుభావులు మాత్రం ఏకంగా బైక్ పైనే స్నానం చేస్తూ ప్రయాణం చేస్తున్నారు. ఆ ఇద్దరూ యువకులు లేచే సరికి వారి ఆఫీస్ టైం అయిపోయిందో ఏంటో మరి, టైం సేవ్ అవుతుందని కాబోలు ఈ విధంగా ద్విచక్ర వాహణంపై స్నానం చేస్తూ వెళ్లిపోయారు. ఏంటి బైక్ పైన స్నానం చేసారా.. అది ఎలా సాధ్యం అనుకుంటున్నారు. ఇలాంటి వింత పనిని ఎవరు ఎక్కడ చేసారో తెలుసుకోవాలను కుంటున్నారా.

పూర్తి వివరాల్లోకెళితే వియత్నాంలోని బింగ్ డుయాంగ్లో డౌ టియెంగ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. టియెంగ్ ప్రాంతంలో నివసిస్తున్నఇద్దరు వ్యక్తులు బైకు మీద స్నానం చేస్తూ ప్రయాణించడం ప్రారంభించారు వెనకాల కుర్చున్న వ్యక్తి తాను ఒంటి మీద నీళ్లు పోసుకోవడమే కాకుండా, బైకు నడిపిస్తున్న వ్యక్తిపైన కూడా నీళ్లు పోసి, సబ్బు రాస్తున్నాడు. దీంతో రోడ్డు పైన వెళ్లే ఇరత ప్రయాణికులు ఆ ఇద్దరు యువకులు చేసే పనిని చూసి ఆశ్చర్యపోయారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆ యువకులకు ట్రాఫిక్ ఉల్లంఘనలు అతిక్రమించినందుకు రూ.5 వేలు జరిమానా విధించారు. అంతే కాదు ఆ ఇద్దరు యువకులకు బైకు ఇచ్చినందుకు యజమానికి రూ.4,300 జరిమానా విధించారు. స్నానం చేస్తూ బైకు నడిపిన ఆ యువకుడిని హుయిన్ తన్ ఖాన్హ్ (23)గా గుర్తించారు. అంతే కాదు వారి వద్ద కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని గుర్తించారు. వాళ్లు ఫైన్ కడితే కట్టారు కానీ ఇప్పుడు ఆ యువకుల వీడియో మాత్రం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories