కీలక మార్పు చేసిన ట్విట్టర్..

కీలక మార్పు చేసిన ట్విట్టర్..
x
Highlights

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో ఇకపై రోజుకు 400 మందిని మాత్రమే ఫాలో అవ్వాలి. అలాగే ఏ యూజర్‌ అయినా సరే గరిష్టంగా 5వేల మందిని మాత్రమే ఫాలో...

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో ఇకపై రోజుకు 400 మందిని మాత్రమే ఫాలో అవ్వాలి. అలాగే ఏ యూజర్‌ అయినా సరే గరిష్టంగా 5వేల మందిని మాత్రమే ఫాలో అవచ్చు. ఆ పరిమితి దాటితే యూజర్లు కొంత కాలం ఆగాల్సి ఉంటుంది. ఆ సమయంలో వారి ఫాలోవర్ల సంఖ్య పెరిగితే అందుకు అనుగుణంగా వారికి ఇతర అకౌంట్లను ఫాలో అయ్యేందుకు అవకాశం ఇస్తుంది ట్విట్టర్. స్పామ్‌లకు చెక్‌ పెట్టేందుకు ఈ కొత్త నిబంధనను అందుబాటులోకి తెచ్చింది.

ఇకపై ట్విట్టర్‌ లో ఏ యూజర్‌ అయినా సరే.. రోజుకు 400 మందిని మాత్రమే ఫాలో అయ్యేలా కోడ్ రాసింది. అంతకు మించి ఫాలో అయితే డే లిమిట్ ఓవర్ అని ఎర్రర్‌ మెసేజ్‌ చూపిస్తుంది. అయితే ఇది కేవలం నాన్‌ వెరిఫైడ్‌ అకౌంట్లకు మాత్రమే వర్తిస్తుంది. వెరిఫైడ్‌(బ్లుటిక్) అకౌంట్లు ఉన్న ట్విట్టర్‌ యూజర్లు రోజుకు 1000 మందిని ఫాలో అయ్యే అవకాశం ఉంచింది. కాగా ఈ కొత్త నిబంధనలు ఇప్పటికే అమలులోకి వచ్చినట్టు ట్విట్టర్‌ ఒక ట్వీట్‌లో వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories