బర్గర్ తింటే ...పాతికవేలు ప్రైజ్ మనీ

బర్గర్ తింటే ...పాతికవేలు ప్రైజ్ మనీ
x
Highlights

విదేశీ పర్యటకులు ఎక్కుగా ఇష్టపడే దేశం అంటే అది థాయ్ లాండ్. అక్కడ ఉండే బీచ్ లు, ఎంతో అందంగా కనిపించే ద్వీపాలు ఆ దేశస్తుల సాంప్రదాయాలు అందరినీ...

విదేశీ పర్యటకులు ఎక్కుగా ఇష్టపడే దేశం అంటే అది థాయ్ లాండ్. అక్కడ ఉండే బీచ్ లు, ఎంతో అందంగా కనిపించే ద్వీపాలు ఆ దేశస్తుల సాంప్రదాయాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అంతేకాదు ఆ దేశం పగటి పూట కంటే కూడా రాత్రి వేళ్లలో ఎంతో అందంగా కనిపిస్తుంది. వీటన్నిటీ చూడడానికి వచ్చిన థాయ్ పర్యాటకులకోసం, థాయ్ దేశస్తులకు అక్కడి ఒక రెస్టారెంట్ మంచి ఆఫర్ ని అందిస్తుంది. అది ఏంటంటారా బర్గర్ తిన్న వారికి రూ.25వేలు ఇస్తామని ప్రకటించారు. ఏంటి బర్గర్ తింటే 25వేల అనుకుంటుంన్నారా. అది నిజం..

థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ నగరంలో క్రిస్ స్టీక్స్ అండ్ బర్గర్స్ అనే రెస్టారెంట్ అక్కడ ఉన్న కస్టమర్లకు తిండి పోటీ నిర్వహిస్తుంది. ఈ పోటీలో ఒక్కో బర్గర్ ను 9 నిమిషాల్లో తినేస్తే చాలు వారికి రూ.25వేలు ఇస్తామని ప్రకటించారు. ఓ‍హ్ ఇంతేనా బర్గర్ తినడమేగా అనుకుంటున్నారా.. అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వారు ఇచ్చే బర్గర్ ఏదో ఒక పీస్, లేదా రెండు పీస్ లు అనుకుంటున్నారేమో కదా. కానీ అసలు కాదు ఆ బర్గర్ బరువు దాదాపుగ 6 కిలోలు ఉంటుంది.

థాయ్ దేశంలో తయారు చేసే బర్గర్లన్నింటి లోనూ ఇదే పెద్ద పరిమాణంలో ఉంటుంది. మరి ఇంత పెద్ద దాన్ని కేవలం 9 నిమిషాల్లో తినడం అంటే సాధారణ విషయమేనా.. ఎవరూ తినలేరనే గట్టి నమ్మకంతో క్రిస్ స్టీక్స్ అండ్ బర్గర్స్ వారు ఈ పోటీలను నిర్వహించారు. వీరు పోటీలు మొదలు పెట్టినప్పటినుంచి చాలా మంది ఈ పోటీలో పాల్గొని వెనుదిరిగారట. పోటీలో ముందుకొచ్చిన వాళ్లు ఎవరూ కూడా 15 నిమిషాల కంటే తక్కువ సమయం తీసుకోలేదంట. పోటీలోపాల్గొన్న వారు బర్గర్ ను తిని బిల్లు కడుతున్నందుకు రెస్టారెంట్ వారికి ఆదాయం మాత్రం దండిగానే వస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories